Begin typing your search above and press return to search.
వందేళ్లలో ఇలాంటి సినిమా రాలేదు-పీవీపీ
By: Tupaki Desk | 25 Jan 2017 6:23 AM GMTవందేళ్లకు పైగా చరిత్ర ఉన్న భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ‘ఘాజి’ లాంటి సినిమా రాలేదని బల్లగుద్ది చెబుతానంటున్నాడు పొట్లూరి వర ప్రసాద్ అలియాస్ పీవీపీ. ఇలాంటి సినిమాను నిర్మించినందుకు తాను గర్విస్తున్నట్లు పీవీపీ చెప్పాడు. చిన్న ప్రాజెక్టుగా మొదలైన ‘ఘాజి’ ఈ రోజు చాలా పెద్ద స్థాయికి వెళ్లిందని.. తాను ఈ సినిమా గురించి ఇంత గొప్పగా ఎందుకు చెబుతున్నానో ఫిబ్రవరి 17న తెలుస్తుందని పీవీపీ అన్నాడు.
‘‘గత ఏడాది ఇదే సమయానికి మా ‘క్షణం’ సినిమా సిద్ధమైంది. ఫిబ్రవరిలో విడుదలై అద్భుత విజయం సాధించింది. ఈసారి అదే నెలలో ‘ఘాజి’తో వస్తున్నాం. ఇండియాలో ఇప్పటిదాకా వేల సినిమాలు వచ్చాయి. అందులో పౌరాణికాలున్నాయి. జానపదాలున్నాయి. సాంఘిక చిత్రాలున్నాయి. ఇంకా చాలా జానర్ల సినిమాలున్నాయి. కానీ ఈ వందేళ్లలో ఇండియాలో ‘ఘాజి’ లాంటి సినిమా మాత్రం రాలేదని కచ్చితంగా చెప్పగలను. గుండెల మీద చేయి వేసుకుని ఈ మాట చెబుతున్నా. ఇలాంటి సినిమాను ఇండియన్ స్క్రీన్ మీద ఇప్పటిదాకా చూసి ఉండరు. ఇలాంటి సినిమాలో భాగమైనందుకు గర్వంగా ఉంది. ఈ సినిమా మొదలైనపుడు చిన్నగానే మొదలైంది. తర్వాత ఇంతింతై వటుండింతై అన్నట్లు చాలా పెద్ద స్థాయికి వెళ్లిపోయింది. వామనుడిలా మొదలై.. రానా సైజుకు సినిమా పెరిగింది. మేం ఎలాంటి సినిమా తీశామో ఫిబ్రవరి 17న తెలుస్తుంది. ఇండియన్ సినిమా చరిత్రలో ప్రత్యేకంగా నిలిచిపోయే సినిమా ఇది’’ అని పీవీపీ అన్నాడు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/