Begin typing your search above and press return to search.
పీవీపీ ట్వీట్ తో ఎవరికి కౌంటర్ ఇచ్చాడు...?
By: Tupaki Desk | 13 Jun 2020 11:10 AM GMTప్రముఖ నిర్మాత పీవీపీ (ప్రసాద్ వీ పొట్లూరి) తన సినిమాలతోనే కాకుండా ట్వీట్స్ తో కూడా వార్తల్లో ఉంటూ ఉంటాడు. బిజినెస్ మ్యాన్ గా ప్రొడ్యూసర్ గా అందరికి సుపరిచితమైన పీవీపీ 2019 సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ తరపున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అయితే రాజకీయాలపై సమకాలీన అంశాలపై తనదైన శైలిలో స్పందిస్తూ సమీప ప్రత్యర్థులపై పరోక్షంగా ట్వీట్స్ చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో పీవీపీ లేటెస్టుగా చేసిన ట్వీట్ వైరల్ అయింది. ఇటీవల బాలయ్య - బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా టీజర్ రిలీజైన సంగతి తెలిసిందే. ఈ టీజర్ లో బాలయ్య పవర్ ఫుల్ డైలాగ్ చెప్తూ "లంబ్డి...." అనే సెన్సార్ పదాలను ఉపయోగించాడు. అప్పటి నుండి ఈ డైలాగ్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది. అయితే ఈ డైలాగ్ ఏపీలోని ఒక మినిస్టర్ కి కౌంటర్ గా బాలయ్యతో చెప్పించాడని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
ఇదిలా ఉండగా ఇప్పుడు ఆ డైలాగ్ లోని సెన్సార్ చేయవలసిన పదాలతో పీవీపీ ఒక ట్వీట్ చేసాడు. ''బీసీ నా, ఓసీ నా, కాపా, కమ్మా, రెడ్డా, రాజా, వెలమ, వైశ్య, బ్రాహ్మడా, బలిజా కాదు, చట్టానికి చుట్టమయేది నేరగాళ్లే కానీ కులాలు కాదు లంబ్డి కొడకా..!! సినిమా డైలాగ్ కాదు MP.. ఆధారాలు లేకుండా సొల్లు వాగుడు వాగే అందరి మీద ప్రజల ఏకాభిప్రాయం'' అని ట్వీట్ చేసాడు. ఈ ట్వీట్ లో పీవీపీ ఎంపీ పేరు మెన్షన్ చేయనప్పటికీ MP అని మెన్షన్ చేసారు. దీంతో ఆ ఎంపీ ఎవరు అని సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు. కాగా నిన్న మాజీ మంత్రి అచ్చెన్నాయుడు ఈ.ఎస్.ఐ స్కామ్ లో అరెస్టైన సంగతి తెలిసిందే. దీనిపై ఎంపీ కేశినేని నాని స్పందిస్తూ బీసీ లీడర్ అయిన అచ్చెన్నాయుడు ని అరెస్ట్ చేయడం అన్యాయం అంటూ ఆయన అరెస్ట్ ని ఖండించాడు. ఇప్పుడు పీవీపీ వేసిన తాజా ట్వీట్ కేశినేని నాని కి కౌంటర్ గా ఉందని సోషల్ మీడియాలో నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. పీవీపీ తెలివిగా ఎంపీ పేరు చెప్పకుండా 'ఆధారాలు లేకుండా అనవసరంగా మాట్లాడొద్దని.. చట్టానికి చుట్టమయ్యేది నేరం చేసిన వారే కానీ కులాలు కాదని' హితబోధ చేసాడని నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు. మరి ఈ వ్యాఖ్యలపై టీడీపీ వర్గీయులు ఎలా స్పందిస్తారో చూడాలి.