Begin typing your search above and press return to search.
‘అప్పట్లో ఒకడుండేవాడు’ పీవీపీకి నచ్చేసి..
By: Tupaki Desk | 29 Dec 2016 1:30 AM GMTఈ మధ్య కొన్ని చిన్న సినిమాలకు పెద్ద నిర్మాతల అండ దొరుకుతోంది. గత ఏడాది ‘సినిమా చూపిస్త మావ’ సినిమా ప్రివ్యూ చూసి నచ్చేసి.. తనే సొంతంగా రిలీజ్ చేశాడు దిల్ రాజు. ఈ ఏడాది ‘పెళ్లిచూపులు’ సినిమాకు సురేష్ బాబు అండగా నిలిచాడు. తాజాగా మరో అగ్ర నిర్మాత పొట్లూరి వరప్రసాద్ కూడా ఓ ఆసక్తికర చిన్న సినిమాకు అండగా నిలిచాడు. నారా రోహిత్-శ్రీవిష్ణు కాంబినేషన్లో సాగర్ చంద్ర రూపొందించిన ‘అప్పట్లో ఒకడుండేవాడు’ సినిమాను పీవీపీ తన కుటుంబంతో కలిసి వీక్షించడం విశేషం. ఆయనకు సినిమా భలేగా నచ్చేయడంతో ఈ చిత్ర యూనిట్ సభ్యులతో కలిసి ప్రెస్ మీట్లో పాల్గొని మరీ దీని గురించి మంచి మాటలు చెప్పడం విశేషం.
‘‘అనుకోకుండా ‘అప్పట్లో ఒకడుండేవాడు’ సినిమా చూశా. బాగా నచ్చడంతో ఇంకోసారి మా ఫ్యామిలీని తీసుకెళ్లి రెండోసారి సినిమా చూశా. అద్భుతమైన సినిమా ఇది. యువతకు బాగా నచ్చుతుంది. కాంప్లికేటెడ్ సబ్జెక్టుతో సాగర్ చంద్ర ఈ చిత్రాన్ని రూపొందించాడు. చాలా వైవిధ్యమైన కథాంశం. అనేక ఆసక్తికర విషయాల్ని కలిపి చెప్పారు. సినిమా చాలా ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది. ఇలాంటి సినిమాలకు ఇండస్ట్రీకి చాలా అవసరం. ఈ ఏడాది మేం ‘క్షణం’ లాంటి చిన్న సినిమా తీసి పెద్ద విజయాన్నందుకున్నాను. ఆ సినిమా మీద ఎంత నమ్మకం కలిగిందో.. ‘అప్పట్లో ఒకడుండేవాడు’ మీద కూడా అంతే గురి కుదిరింది. తప్పకుండా ప్రేక్షకులకు నచ్చే చిత్రమిది. ఇలాంటి సినిమాలకు అందరూ అండగా నిలవాలి’’ అని పీవీపీ చెప్పాడు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/