Begin typing your search above and press return to search.
నష్టాల్ని హీరో, దర్శకుడు పంచుకోవాలి
By: Tupaki Desk | 22 Nov 2015 1:30 PM GMTపీవీపీ సినిమాస్.. సౌత్ లోనే అగ్రనిర్మాణ సంస్థగా హవా చాటుతోంది. కార్పొరెట్ పద్ధతిలో సినిమా నిర్మించడం అసాధ్యం అని అంతా పెదవి విరిచేస్తుంటే నిర్మాత పొట్లూరి వరప్రసాద్ మాత్రం ఏటికి ఎదురీదుతూ అనుకున్నది చేసి చూపిస్తున్నారు. కార్పొరెట్ స్టయిల్ లో సినిమాలు తీయలేమా? తీసి చూపిస్తా చూడు అంటూ సవాల్ విసిరారాయన? అయితే ఆయన కార్పొరెట్ స్టయిల్ కి సినిమా ఇండస్ర్టీ రెడ్ కార్పెట్ వేసినా ఆరంభమే పెద్ద పెద్ద ఝలక్ లు తగిలాయి.
అనుభవ రాహిత్యం అక్కడ బాగా దెబ్బ కొట్టింది. వర్ణ లాంటి పరాజయం అనుభవ రాహిత్యమే అన్న పేరొచ్చింది. అయినా పీవీపీ మొండిగా సినిమాలు తీస్తూనే ఉన్నారు. తొండ ముదిరితేనే ఊసరవెల్లి అన్న చందంగా ఇప్పుడాయన వరుసగా సినిమాలు తీస్తూ సౌత్ లోనే టాప్ ప్రొడ్యూసర్ గా కొనసాగుతున్నారు. తెలుగు - తమిళ్ ద్విభాషా చిత్రాలు తెరకెక్కిస్తూ తన హవా చాటుతున్నారు. లేటెస్టుగా అనుష్క ప్రధానపాత్రలో సైజ్ జీరో చిత్రాన్ని తెలుగు - తమిళ్ లో రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా పీవీపీ మాట్లాడుతూ -`చెక్ బుక్ పట్టుకుని కూచుంటే నిర్మాత కానే కాదు. కథ నుంచి ప్రతి విషయంలో నిర్మాత ఎంత శ్రమిస్తే నష్టం అంత తగ్గించుకోవచ్చు. ఆ సంగతిని అనుభవ పూర్వకంగా తెలుసుకున్నా.. అంటున్నారాయన
అంతేకాదు.. ''సినిమాలు ఎప్పుడూ ఫెయిల్ కావు. బడ్జెట్ లే ఫెయిలవుతుంటాయి.. ఒకవేళ నష్టాలొస్తే దర్శకుడు, హీరో కూడా పంచుకోవాలి. అప్పుడే నిర్మాతకు మనుగడ ఉంటుంది'' అంటూ తన అనుభవాల్ని పూసగుచ్చడాయన.