Begin typing your search above and press return to search.
సైజ్ జీరో.. మరీ అంత కాన్ఫిడెన్సా?
By: Tupaki Desk | 23 Nov 2015 11:30 AM GMTసౌత్ ఇండియాలో అత్యంత భారీగా రిలీజ్ కాబోతున్న లేడీ ఓరియెంటెడ్ మూవీగా ‘సైజ్ జీరో’ రికార్డు సృష్టించేలా కనిపిస్తోంది. తెలుగు - తమిళ భాషల్లో ఒకేసారి విడుదలవుతుండటంతో ‘రుద్రమదేవి’ కంటే కూడా ‘సైజ్ జీరో’దే భారీ రిలీజ్ అంటున్నారు. ‘సైజ్ జీరో’ విషయంలో ఉన్న హైప్ కానీ.. దీన్ని రిలీజ్ చేస్తున్న తీరు కానీ చూస్తుంటే.. పీవీపీ సంస్థ ఈ సినిమాను ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోందో అర్థమైపోతుంది.
ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 2 వేలకు పైగా థియేటర్లలో ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు. సినిమాను మంచి రేటుకే అవకాశం వచ్చినా కూడా పీవీపీ సంస్థ వాటిని కాదని.. సొంతంగా సినిమాను రిలీజ్ చేసుకుంటోందట. ఇది సినిమా మీద వాళ్లకున్న కాన్ఫిడెన్స్ ను తెలియజేస్తుందని అంటున్నారు. ఒక్క తెలుగు వెర్షనే దాదాపు 1400 థియేటర్లలో రిలీజవబోతోంది.
తమిళ వెర్షన్ కూడా 600కు పైగా థియేటర్లలో విడుదల కాబోతోంది. అక్కడ థియేటర్లు తక్కువ కాబట్టి ఇదే పెద్ద రిలీజ్ కింద లెక్క. యుఎస్ లో ‘సైజ్ జీరో’ తెలుగు వెర్షన్ ను 110 స్క్రీన్ లలో రిలీజ్ చేయబోతున్నారు. ‘రుద్రమదేవి’ తర్వాత మళ్లీ అనుష్క సినిమాకే ఇన్ని స్క్రీన్ లు లభించాయి. ముందు నుంచి సినిమాను క్రియేటివ్ గా ప్రమోట్ చేస్తుండటంతో జనాల్లో ఆసక్తి బాగానే ఉంది. ఇక రిలీజ్ విషయంలోనూ రెండు భాషల్లోనూ పోటీ లేకుండా చూసుకుని మంచి హైప్ మధ్య సినిమాను విడుదల చేస్తున్నారు.