Begin typing your search above and press return to search.
పీవీపీ నేర్చుకున్న బ్రహ్మోత్సవం పాఠం
By: Tupaki Desk | 29 Oct 2016 5:30 PM GMTబ్రహ్మోత్సవం.. ఈ పేరు ఎత్తితే మహేష్ బాబు అభిమానులు ఏదోలా అయిపోతారు. ఇక ఆ ప్రాజెక్టులో ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కరి పరిస్థితీ అంతే. అలాంటి భారీ సినిమాను నిర్మించి భారీగా నష్టాలు మూటగట్టుకున్న పీవీపీ కూడా ఎంత ఫీలై ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో బ్రహ్మోత్సవం గురించి మాట్లాడుతూ.. ఇది తనను ఎంతగానో నిరాశ పరిచిన.. బాధపెట్టిన సినిమా అన్నాడు పీవీపీ. ఐతే ఆ సినిమా ఎందుకు ఫెయిలైందో అర్థం చేసుకున్నానని.. దాన్నుంచి పాఠం నేర్చుకుని ఇకపై అలా జరగకుండా జాగ్రత్త పడుతున్నానని పీవీపీ చెప్పాడు. మరి బ్రహ్మోత్సవం ఫెయిల్యూర్ కు పీవీపీ చెబుతున్న కారణమేంటో.. ఆయన నేర్చుకున్న పాఠమేంటో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం పదండి.
‘‘భారీ సినిమాల విషయంలో షూటింగ్ జరుగుతుండగానే రిలీజ్ డేట్ అనౌన్స్ చేసేస్తుంటాం. లాస్ మినిట్లో ఒక్కోసారి విడుదల తేదీ మార్చాల్సి వస్తుంది. రిలీజ్ డేట్ రేపనగా ముందు రోజు ఫస్ట్ కాపీ వస్తుంది. అలాంటపుడు ఫస్ట్ కాపీ చూసి మార్పులు చేర్పులు చేయాలనుకున్నా చేయలేం. ఇలాంటి పరిస్థితే ‘బ్రహ్మోత్సవం’కు ఎదురైంది. అందుకే ఫ్లాపైంది. పోస్ట్ ప్రొడక్షన్ కు ఎక్కువ టైం ఉండాలని అర్థమైంది. బాలీవుడ్లో అమీర్ ఖాన్ హీరోగా నటించిన ‘దంగల్’ సినిమా విడుదల తేదీకి మూడు నెలల ముందే పూర్తయింది. ఆయన సన్నిహితులకు.. విమర్శకులకు చూపిస్తున్నారు. ఏమైనా మార్పులు చేయాలంటే చేస్తున్నారు. మనకు అలా కుదరడం లేదు. అందుకే రానాతో చేస్తున్న ‘ఘాజి’ విషయంలో జాగ్రత్త పడుతున్నాం. పోస్ట్ ప్రొడక్షన్ కు చాలా టైం తీసుకుంటున్నాం’’ అని పీవీపీ చెప్పాడు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/