Begin typing your search above and press return to search.
పీవీపీ చంపేస్తానని బెదిరించారు! బండ్ల గణేష్
By: Tupaki Desk | 5 Oct 2019 8:52 AM GMT''గౌరవనీయులైన ముఖ్యమంత్రి జగన్ గారికి.. సార్ మమ్మల్ని అందరినీ పివిపి బారి నుంచి కాపాడండి .. మీ పేరు చెప్పి చిత్రపరిశ్రమలో అందర్నీ బెదిరిస్తున్నారు.. దయచేసి కట్టడి చేయండి. రాజన్న రాజ్యం వచ్చిందని ఆనందంతో బతుకుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇలాంటి దుర్మార్గుడి నుంచి కాపాడండి సార్.. ఓడిపోయిన కేసులు కూడా మళ్లీ డబ్బులు కావాలి అని బెదిరించి మాట్లాడితే ఆంధ్ర ప్రదేశ్ నా చేతుల్లో ఉంది మీ అందర్నీ చంపేస్తాను అంటున్నాడు''. సినీ నిర్మాత బండ్ల గణేష్ ట్విట్టర్ వేదికగా చేసిన సంచలన ట్వీట్లు ఇవి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రముఖ నేత పొట్లూరి వరప్రసాద్ (పీవీపీ)పై బండ్ల గణేష్ పైవిధంగా సంచలన ఆరోపణలు చేశారు. పొట్లూరి వరప్రసాద్ తనను హత్య చేస్తానని బెదిరించారని.. తనకు రక్షణ కల్పించాలని బండ్ల గణేశ్ తాజాగా జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించడం పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారింది.
శుక్రవారం రాత్రి తన ఇంటిపై బండ్ల గణేశ్ అతడి అనుచరులు దాడి చేశారని ఆరోపిస్తూ పీవీపీ కేసు పెట్టిన నేపథ్యంలో బండ్ల రివర్స్ కేసు వేయడమే గాక.. వరుస ట్వీట్లతో వేడెక్కించారు. సీఎం జగన్ పేరు చెప్పి చిత్రపరిశ్రమలో అందర్నీ పీవీపీ బెదిరిస్తున్నారని బండ్ల ఫిర్యాదు చేయడం ఈ సందర్భంగా సంచలనమైంది. నేటి(శనివారం) ఉదయం 8గంటల నుంచి బండ్ల వరుస ట్వీట్లతో మోతెక్కించారు. రాజన్న రాజ్యం వచ్చిందని ఆనందంతో బతుకుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇలాంటి దుర్మార్గుడిగా చేతినుంచి కాపాడండి సార్ అంటూ అతడు ట్వీట్ చేశారు.
అందరూ ఆంధ్రప్రదేశ్ లో అవినీతి లేని పాలన జరుగుతుందని ఆనంద పడుతూ ఉంటే తులసివనంలో గంజాయి మొక్కలు వీరు చేస్తున్న క్రమంలో మీ పార్టీకి నీకు చెడ్డ పేరు వస్తుందని బండ్ల గణేష్ సోషల్ మీడియా వేదికగా పీవీపీపై ఆరోపించారు. ఈ సందర్భంగా మీడియాకు ఓ ప్రకటన విడుదల చేసిన బండ్ల గణేశ్.. పీవీపీ తనను కిడ్నాప్ చేసి హత్య చేసేందుకు ప్రయత్నిస్తున్నాడని ఆరోపించారు. రక్షణ కోసం తాను పోలీసులను ఆశ్రయించానని.. నేటి ఉదయం నుంచి పీవీపీ అనుచరులు తనకు ఫోన్ చేసి బెదిరిస్తున్నారని .. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశానని వెల్లడించారు. ఎన్టీఆర్ కథానాయకుడిగా బండ్ల గణేష్ నిర్మించిన 'టెంపర్' సినిమా ఆర్థిక వ్యవహారాల్లో తేడాలు రావడంతో పీవీపీ-బండ్ల గణేష్ ఒకరిపై ఒకరు పరస్పరం ఆరోపించుకున్నారు. పోలీస్ గడప వరకూ వెళ్లడంతో ఇంత పెద్ద గొడవ జరుగుతోంది. టెంపర్ చిత్రానికి పీవీపీ 30 కోట్ల మేర ఫైనాన్స్ చేయగా అసలు వడ్డీ లెక్కల్లో చెల్లింపుల వ్యవహారంలో ఆ ఇద్దరి మధ్యా గొడవలు తారా స్థాయికి చేరాయని తెలుస్తోంది.