Begin typing your search above and press return to search.
పివిపికే ఎందుకిలా?
By: Tupaki Desk | 9 April 2018 8:33 AM GMTరెండున్నర గంటల సినిమా చూసినంత తేలికగా తెరవెనుక వ్యవహారాలు ఉండవు. ముఖ్యంగా వ్యాపార లావాదేవీలకు సంబంధించి సున్నితమైన అంశాలు ఎన్నో అందులో ఉంటాయి. పివిపి సంస్థ ఇప్పుడు అనుభవలేమి వల్ల అలాంటి ఇబ్బంది కొనితెచ్చుకుందా అంటే ఔననే అంటున్నాయి ఫిలిం నగర్ వర్గాలు. గతంలో మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ప్రిన్స్ 25వ సినిమా తామే తీయబోతున్నట్టు అప్పట్లో ప్రకటనలు కూడా గుప్పించారు. కాని తర్వాత ఏమైందో తెలియదు కాని అది కాస్త దిల్ రాజు-అశ్విని దత్ జాయింట్ వెంచర్ లోకి వెళ్లిపోయింది.స్క్రిప్ట్ మొత్తం తమకు చెప్పి దాన్నే తమ బ్యానర్ లో తీస్తానని చెప్పి మోసం చేసాడని వంశీ పైడిపల్లి మీద లీగల్ చర్యలకు కూడా వెనుకాడలేదు. కాని ఏదో రాజీ మంత్రం జరిపించేసి మొత్తానికి అది దిల్ రాజు-దత్తు గారికే చేసేలా రాజీ మంత్రం కుదిరిపోయింది. అదంతా జరిగిపోయిన ఎపిసోడ్.
ఇప్పుడు సరిగ్గా ఇలాంటి మరో ఉదంతమే ఘాజీ దర్శకుడు సంకల్ప్ రెడ్డి వల్ల పివిపి సంస్థ మళ్ళి ఫేస్ చేస్తున్నట్టు టాక్. వరుణ్ తేజ్ హీరోగా లావణ్య త్రిపాటి హీరొయిన్ గా స్పేస్ షిప్ థ్రిల్లర్ గా రూపొందనున్న సినిమా త్వరలో షూటింగ్ ప్రారంభించుకోనుంది. ఘాజీ నిర్మించిన టైంలోనే రెండో సినిమా కూడా తమకే చేసే విధంగా సంకల్ప్ రెడ్డితో ఒప్పందం జరిగిందట. కాని ఇప్పుడు వరుణ్ తేజ్ తో సంకల్ప్ చేసే స్పేస్ మూవీకి దర్శకుడు క్రిష్ తో పాటు అతని ఫ్రెండ్ రాజీవ్ రెడ్డి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు ఇది పివిపికి షాక్ కి గురి చేసిందని టాక్. అందుకే సంకల్ప్ మీద కూడా చట్టపరంగా నోటీసులు ఇచ్చే దిశగా పివిపి ప్లాన్ లో ఉందని తెలిసింది.
నిజానికి పివిపికి సినిమా నిర్మాణం అచ్చి రాలేదు. భారీగా నిర్మించిన వర్ణ, సైజ్ జీరో, బ్రహ్మోత్సవం అన్ని ఒకదాన్ని మించి ఒకటి పరాజయం పాలయ్యాయి. ఊపిరి పేరు తీసుకొచ్చింది కాని గర్వపడే లాభాలు కాదు. ఘాజీ బడ్జెట్ తక్కువ కనక సేఫ్ అయ్యింది. తర్వాత గ్యాప్ తీసుకుంది పివిపి. మరి ఇప్పుడు సంకల్ప్ రెడ్డి తో లీగల్ గా ప్రొసీడ్ అయ్యే విషయం నిజమేనా లేక పుకారా అనే నిర్ధారణ ఇంకా జరగాల్సి ఉంది.