Begin typing your search above and press return to search.

PVR బంపరాఫర్, రూ.99కే మూవీ టిక్కెట్

By:  Tupaki Desk   |   17 Jan 2023 9:39 AM GMT
PVR బంపరాఫర్, రూ.99కే మూవీ టిక్కెట్
X
కస్టమర్లను అట్రాక్ట్ చేసేందుకు దుకాణాలు, షాపింగ్ మాల్స్, కంపెనీలు, ఈ-కామర్స్ సైట్లు వినూత్న రీతిలో ఆఫర్లు ప్రకటిస్తారనే విషయం మన అందరికీ తెలిసిందే. ముఖ్యంగా పండుగలు, పబ్బాలప్పుడైతే సరికొత్త ఆఫర్లతో ముందుకు వస్తుంటారు.

అదే రీతిలో పాపులర్ మల్టీప్లెక్స్ చైన్ పీవీఆర్ ఇలాంటి ఓ ఆఫర్ తీసుకువచ్చింది. అతి తక్కువ ధరకే పీవీఆర్ లో సినిమా చూసే ఆఫర్ తీసుకు రాబోతుంది. సినిమా లవర్స్ డే సందర్భంగా సినీ ప్రేక్షకులు కేవలం రూ.99కే పీవీఆర్ మల్టీప్లెక్స్ లో సినిమా చూడవచ్చు. కేవలం రూ.99 ఏ సినిమా అయినా, ఏదైనా షో చూడవచ్చు. అయితే ఈ ఆఫర్ ఒక్కరోజు మాత్రమే వర్తించనుంది. అది జనవరి 20వ తేదీ.

రూ. 99కే పీవీఆర్ లో సినిమా చూడొచ్చని మురిసి పోతున్నారేమో.. టర్మ్స్ అండ్ కండీషన్స్ కూడా ఉన్నాయి. అవేంటంటే.. రూ.99 కే సినిమా ఆఫర్ చండీగఢ్, పాండిచ్చేరి, పఠాన్ కోట్ వంటి నగరాల్లో చెల్లుబాటు కాదు.

అలాగే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో ఈ ఆఫర్ ఉంటుంది. అయితే కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో టికెట్ 100లకు అదనంగా జీఎస్టీ చెల్లించాల్సిందే. తెలంగాణలో అయితే టికెట్ ధర రూ.112 గా ఉంటుంది. దీంతో పాటు జీఎస్టీ చెల్లించాల్సిందే.

అలాగే రిక్లైనర్స్, ఐమ్యాక్స్, 4డీఎక్స్ వంటి ప్రీమియం కేటగిరీ సీట్లు ఈ ఆఫర్ పరిధిలోకి రావు. వాటి ధరలు ఎప్పట్లాగే ఉంటాయి.ఇలాంటి ఆఫర్ ప్రకటించడం ఇదేం తొలిసారి కాదు. గతంలో 2022 సెప్టెంబర్ 16వ తేదీన మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా జాతీయ సినిమా దినోత్సవాన్ని జరుపుకుంది. అప్పుడు టికెట్ ధర కేవలం రూ.75 రూపాయలు మాత్రమే. ఇలాంటి ఆఫర్లతో సినీ అభిమానులను ఆకట్టుకోవచ్చని ఇలాంటి ఆఫర్ ప్రయత్నాలను మల్టీప్లెక్సులు చేస్తున్నాయి.

సంక్రాంతి పండగకు దక్షిణాదిలో అగ్ర హీరోల సినిమాలు బరిలో నిలిచాయి. మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య, బాలయ్య బాబు నటించిన వీరసింహారెడ్డి, దళపతి విజయ్ నటించిన వారసుడు, అజిత్ కుమార్ నటించిన తెగింపు సినిమాలు సంక్రాంతి పండగకు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. సినిమా లవర్స్ డే సందర్భంగా ఈ సినిమాలను తక్కువ ధరకే వీక్షించే అవకాశం వచ్చింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.