Begin typing your search above and press return to search.
తాజా డీల్ తో భారత అతి పెద్ద మల్టీఫ్లెక్స్ చైన్ గా పీవీఆర్ ఐనాక్స్!
By: Tupaki Desk | 28 March 2022 5:11 AM GMTఅంచనా నిజమైంది. వినోదరంగంలో అతి పెద్ద డీల్ కు సంబంధించిన అధికారిక ప్రకటన వెల్లడైంది. గడిచిన కొంతకాలంగా దేశీయన అతి పెద్ద మల్టీఫ్లెక్స్ చైన్ పీవీఆర్ లో ఐనాక్స్ విలీనమవుతుందన్న వార్తలు నిజం కావటమే కాదు.. తాజాగా దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెల్లడైంది. ఇప్పటివరకు వేర్వేరుగా ఉన్న పీవీఆర్.. ఐనాక్స్ లు ఒక్కటి మారటమే కాదు.. పీవీఆర్ ఐనాక్స్ లు మారనున్నాయి. కొత్తగా ఏర్పాటు అయ్యే మల్టీఫ్లెక్సులు మాత్రం పీవీఆర్ ఐనాక్స్ బ్రాండ్ కింద కార్యకలాపాలు నిర్వహించనున్నారు.
ఈ రెండు సంస్థల విలీనానికి సంబంధించి రెండు కంపెనీలకు చెందిన డైరెక్టర్ల బోర్డులు ఓకే చెప్పేశాయి. దీనికి సంబంధించిన సమాచారాన్ని ఎక్స్ఛేంజీలకు సమాచారాన్ని అందించాయి. కొవిడ్ మహమ్మారి దెబ్బకు కుదేలైన ఎన్నో రంగాల్లో వినోద రంగం భారీగా దెబ్బ పడింది. ఇలాంటి సంక్షోభ సమయంలోనే పీవీఆర్ -ఐనాక్స్ విలీన ప్రకటన వెలువడటం విశేషం. ఇక.. రెండు సంస్థల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం విలీన ప్రక్రియ ఎలా ఉంటుందంటే..
- ప్రతి 10 ఐనాక్స్ షేర్లకు 3 పీవీఆర్ షేర్ల నిష్పత్తిలో విలీనం ఉండనుంది. విలీనం తర్వాత పీవీఆర్ ప్రస్తుత ప్రమోటర్లతో పాటు ఐనాక్స్ ప్రమోటర్లు విలీన సంస్థ సహ ప్రమోటర్లుగా మారనున్నారు.
- విలీన సంస్థలో పీవీఆర్ ప్రమోటర్లకు 10.62 శాతం.. ఐనాక్స్ ప్రమోటర్లకు 16.66 శాతం చొప్పున వాటాలు ఉండనున్నాయి.
- ఐనాక్స్ ను విలీనం చేసుకున్న పీవీఆర్ విషయానికి వస్తే.. ఈ సంస్థకు 73 నగరాల్లో 181 ప్రదేశాల్లో మొత్తం 871 స్క్రీన్లు ఉన్నాయి. పీవీఆర్ టర్నోవర్ రూ.698 కోట్లు. ఇతర ఆదాయం రూ.472 కోట్లు. మొత్తం ఆస్తులు రూ.7450 కోట్లు. ఐనాక్స్ విషయానికి వస్తే.. మొత్తం 72 నగరాల్లో 160 ప్రదేశాల్లో 675 స్క్రీన్లను నడుపుతోంది. 2021 మార్చితో ముగిసే ఆర్థిక సంవత్సరంలో ఐనాక్స్ టర్నోవర్ రూ.148 కోట్లు కాగా.. ఇతర ఆదాయం రూ.42 కోట్లు మాత్రమే. మొత్తం ఆస్తులు రూ.3784 కోట్లుగా నమోదయ్యాయి.
- ఈ విలీన డీల్ పుణ్యమా అని కొత్త సంస్థ (పీవీఆర్ ఐనాక్స్) చేతిలో 109 నగరాల్లో 341 ప్రదేశాల్లో మొత్తం 1546 స్క్రీన్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ సంస్థకు పోటీ సంస్థగా ఉన్న సినీ పోలిస్ చేతిలో మొత్తం 360 స్క్రీన్లు మాత్రమే ఉన్నాయి.
- విలీనం తర్వాత ఏర్పాటయ్యే బోర్డులో మొత్తం 10 మంది సభ్యులు ఉంటే.. ఇరు ప్రమోటర్ కుటుంబాలకు బోర్డులో రెండు స్థానాల చొప్పున సమ ప్రాధాన్యం ఉంటుంది. ఈ విలీనానికి సెబీ.. ప్రమోటర్లతో పాటు అన్ని అనుమతులు రావటానికి ఆరు నుంచి తొమ్మిది నెలల సమయం పట్టొచ్చు.
- విలీన సంస్థ ఎండీగా పీవీఆర్ కు చెందిన అజయ్ బిజిలీ.. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా సంజీవ్ కుమార్ నియమితులయ్యారు. బోర్డులో నాన్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ గా ఐనాక్స్ పవన్ కుమార్ చేరతారు. విలీన సంస్థ నాన్ ఎగ్జిక్యూటివ్ నాన్ ఇండిపెండెంట్ డైరెక్టర్ గా సిద్ధార్థ జైన్ వ్యవహరిస్తారు.