Begin typing your search above and press return to search.

ఇందుకే మ‌ల్టీప్లెక్సుల‌పై ప‌డేది!

By:  Tupaki Desk   |   18 Oct 2018 5:23 AM GMT
ఇందుకే మ‌ల్టీప్లెక్సుల‌పై ప‌డేది!
X
పార్థా! పుట్టిన‌వాడు గిట్ట‌క త‌ప్ప‌దు.. గిట్టిన వాడు మ‌ళ్లీ జ‌న్మించ‌క త‌ప్ప‌దు!! శ్రీ‌కృష్ణుడు అర్జునుడి కి భోధించిన గీతోప‌దేశ‌మిది. దీన్ని కాస్త అటూ ఇటూగా మారిస్తే.. పార్థా.. పుట్టిన‌వాడు వినోదం కోసం మ‌ల్టీప్టెక్సుకి వెళ్ల‌క త‌ప్ప‌దు... క‌ప్పం చెల్లించ‌కా త‌ప్ప‌దు! అని డిక్లేర్ చేయాలి. స‌రిగ్గా ఇదే పాయింట్ మ‌ల్టీప్లెక్స్- బిజినెస్‌ని మూడు పువ్వులు ఆరుకాయ‌లుగా మారుస్తోంది. ఒకే చోట సినిమా- షాపింగ్ అన్న కాన్సెప్టె పెద్ద రేంజులోనే వ‌ర్క‌వుట‌వుతోంద‌ని ఇప్ప‌టికే ఉన్న మ‌ల్టీప్టెక్సులు నిరూపించాయి. అందుకే ఈ రంగంల‌పై బ‌డా సెల‌బ్రిటీలంతా క‌న్నేసారు. అటు బాలీవుడ్ స్టార్లు ఇప్ప‌టికే ఈ రంగంలో నిష్ణాతులెంద‌రో ఉన్నారు. ఇప్పుడు అదే బాట‌లో టాలీవుడ్ టాప్ హీరోలు ప‌య‌నించ‌నున్నారు.

పీవీఆర్ - ఏషియ‌న్ సినిమాస్ - ప్ర‌సాద్స్ ఐమ్యాక్స్‌ - సెంట్ర‌ల్ స్ఫూర్తితో సొంతంగా మల్టీప్లెక్స్ చెయిన్స్ ప్రారంభించాల‌ని మన హీరోలు దృష్టి సారిస్తున్నారు. బాలీవుడ్ బిగ్ స్టార్ల‌కు సొంతంగా మ‌ల్టీప్లెక్సులున్న‌ట్టే త‌మ‌కు కూడా ఉండాల‌నుకుంటున్నారు. దీనివ‌ల్ల త‌మ సినిమాల రిలీజ్‌ల‌కు ఎలాంటి ఇబ్బంది ఉండ‌దు. తెలుగు హీరోలు ప్ర‌భాస్ - మ‌హేష్ - చ‌ర‌ణ్ వీళ్లంద‌రి దారి అదే.

తాజాగా మ‌ల్టీప్లెక్స్ రంగంలో దిగ్గ‌జం పీవీఆర్ సినిమాస్‌...చెన్న‌య్‌- అన్నా న‌గ‌ర్‌లో పీవీఆర్ ఐక‌న్ పేరుతో అదిరిపోయే మ‌ల్టీప్లెక్సును ప్రారంభించింది. మైమ‌రిపిస్తున్న చెన్న‌య్‌- పీవీఆర్ డిజిట‌ల్‌ వీడియో.. చూసి తీరాలి అనిపించేలా ఉంది. ఈ స్క్రీన్ల‌లో మొత్తం 10 స్క్రీన్ల‌తో 2594 మంది కూచునే వీలుంది. త‌మిళ‌నాడులోనే బిగ్గెస్ట్ మ‌ల్టీప్లెక్స్ చెయిన్‌గా పీవీఆర్ చ‌రిత్ర సృష్టించ‌నుందిట‌. ఇక పందెంకోడి విశాల్ సార‌థ్యంలో ఈ మ‌ల్టీప్లెక్సును పీవీఆర్ వాళ్లు ప్రారంభించారు. ఇండియాలో ఇలాంటి భారీ మ‌ల్టీప్లెక్సుల్ని పీవీఆర్ ఇప్ప‌టికే ఎన్నో ర‌న్ చేస్తోంది. వేల‌కోట్ల ఆదాయం ఆర్జిస్తోంది. కేవ‌లం ఒక్క త‌మిళ‌నాడులోనే 2022నాటికి 52 పీవీఆర్ స్క్రీన్ల‌ను ప్రారంభించే యోచ‌న ఉంద‌ని పీవీఆర్ సీఈవో చెబుతున్నారు. ద‌క్షిణ భార‌త‌దేశంలో 41 ప్రాప‌ర్టీల్లో 256 స్క్రీన్లు ఏర్పాటు చేస్తామ‌ని తెలిపారు.

ఇక‌పోతే న‌గ‌రాల్ని ఆక్ర‌మిస్తున్న మ‌ల్టీప్టెక్సులు వినోదాన్ని అందించ‌డంలోనూ పోటీప‌డుతున్నాయి. ఆ క్ర‌మంలోనే ఈ రంగంలో సెల‌బ్రిటీల పెట్టుబ‌డులు టైఅప్‌ల రూపంలో వెల్లువెత్తుతుండ‌డం విశేషం. తెలుగు రాష్ట్రాలు ఏపీ - తెలంగాణ‌లోనూ పెద్ద న‌గ‌రాల్లో భారీగా మ‌ల్టీప్లెక్సులు నిర్మించేందుకు కార్పొరెట్‌తో హీరోలు టై అప్‌లు పెట్టుకుంటున్నార‌న్న స‌మాచారం ఉంది.