Begin typing your search above and press return to search.
`ఖలా` థ్రిల్లర్.. గాయనిని వెంబడించే దెయ్యం?
By: Tupaki Desk | 17 Nov 2022 2:30 PM GMTసైకలాజికల్ థ్రిల్లర్ కథాంశాలపై ఉండే క్యూరియాసిటీ ఎప్పటికీ ప్రత్యేకం. థ్రిల్లర్ అంశాలతో కూడిన పీరియాడికల్ మ్యూజికల్ డ్రామాని తెరకెక్కించాలనే ఆలోచన నేటి ట్రెండ్ కి భిన్నమైనదని చెప్పాలి. చాలా మంది గాయనీ గాయకుల నిజ జీవిత ప్రేమకథా చిత్రాల్లో విషాదాంతాలను చూపించి ప్రేక్షకుల్లో ఎమోషన్ ని రగిలించగలిగారు. బాలీవుడ్ లో ఆషిఖి సిరీస్ ఈ తరహానే. కానీ ఇప్పుడు దానికి భిన్నంగా నేపథ్య గాయని కథాంశాన్ని ఎంచుకుని ఇందులో సైకలాజికల్ థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ ని మెర్జ్ చేసిన తీరు ఆద్యంతం రక్తి కట్టిస్తోంది.
1930ల నాటి కథాంశంతో గాయని జీవితాన్ని తెరపై ఆవిష్కరిస్తున్నారని తాజాగా రిలీజైన ఖాల ట్రైలర్ వెల్లడిస్తోంది. ఖలా అనేది వ్యక్తిగత కల్లోలాలతో పోరాడుతూ వృత్తిపరమైన విజయాన్ని సాధించే గాయకురాలి భావోద్వేగ ప్రయాణం. ఈ సినిమాలో ట్రిప్తీ సింగర్ గా నటిస్తోంది. అయితే గాయని కావాలన్న తన ఆకాంక్షలను ఆమె తల్లి - అక్క వ్యతిరేకించడం.. ఇతరత్రా బాహ్య ప్రపంచంతో ఇబ్బందులు .. వీటన్నిటినీ ఎదురించి తన కెరీర్ లో నిలదొక్కుకోగలిగిందా లేదా? అన్న థీమ్ లైన్ తో సైకలాజికల్ థ్రిల్లర్ మోడ్ లో తెరకెక్కించడం ఆసక్తికరం. 1930లలో ఒక ప్లేబ్యాక్ సింగర్ జీవితాన్ని ఆ రోజుల్లో సినీరంగంలో కష్టతరమైన విజయతీరాలను చేరడానికి పడే పాట్లు తెరపై ఆవిష్కరిస్తున్నారు. గాయని విషాద గతం .. బాల్యం తనను జీవితాంతం ఎలా వెంటాడాయి? అన్నది తెర మీదనే చూడాలి. తనను ప్రోత్సహించాల్సిన కుటుంబ సభ్యులతోనే వ్యతిరేకత ఎదురైనప్పుడు తన వృత్తిలో ఎలా ఎత్తులకు ఎదగాలన్నది..! స్ఫూర్తివంతంగా తెరపై ఆవిష్కరిస్తున్నారని ట్రైలర్ చెబుతోంది.
ప్రముఖ బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ తనయుడు బాబిల్ ఖాన్ ఈ చిత్రంలో తొలిసారిగా నటిస్తున్నాడు. అతను తన పాత్రలో సముచితంగా కనిపిస్తున్నాడు. గ్రేట్ ట్యాలెంటెడ్ నటుడు ఇర్ఫాన్ కొడుకు కావడంతో అతడి నటనపై చాలా అంచనాలున్నాయి. ట్రిప్తి నటన ఆద్యంతం ఆసక్తిని కలిగిస్తోంది. ఈ మూవీ నేపథ్య సంగీతం ఉత్కంఠను రగిలిస్తోంది. నాటి కాలమానానికి తగ్గ టింజ్ నేపథ్య సంగీతంలో ఉంది. సినిమాటోగ్రఫీ - ప్రొడక్షన్ డిజైన్ ప్రతిదీ యూనిక్. ట్రైలర్ ప్రామిస్సింగ్ గా కనిపిస్తోంది.
యూనిక్ కథాంశం ఆసక్తికరం..
ఇటీవలి కాలంలో ఈ తరహా ప్రయత్నం జరగలేదనే చెప్పాలి. ఇది వీక్షకులకు కొత్తదనాన్ని అందించే భరోసాతో కనిపిస్తోంది. ఈ చిత్రానికి అన్వితా దత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఎన్.హెచ్ 16 లాంటి థ్రిల్లర్ మూవీని అందించిన అనుష్క శర్మ ఈ చిత్రానికి నిర్మాత. డిసెంబర్ 1న నెట్ ఫ్లిక్స్ లో విడుదల కానుంది.
ఈ చిత్రం గురించి దర్శకురాలు అన్వితా దత్ మాట్లాడుతూ-``క్లీన్స్ లేట్ ఫిలింజ్ - నెట్ ఫ్లిక్స్ తో నా రెండవ సినిమా ఇది. దర్శకురాలిగా నాకు ఈ ప్రయాణం అద్భుతంగా అనిపిస్తోంది. సంగీత ప్రపంచం నేపథ్యంలో సాగే ఎమోషనల్ స్టోరీ ఖలా. ఇది ఒక తల్లి కూతురి సంబంధం... కీర్తి దాంతో వచ్చి పడే ఒత్తిళ్లు .. చివరకు తాను ఏమి చేయగలదో ట్రైలర్ లో చూపించాం`` అని అన్నారు. ఖలా ప్రపంచం విశ్వవ్యాప్తంగా ఉన్న వీక్షకులను అలరించాలని మేము ఆశిస్తున్నామని అన్నారు.
క్లీన్స్ లేట్ ఫిల్మ్జ్ నిర్మాత కర్నేష్ శర్మ మాట్లాడుతూ-``మేము ప్రత్యేకమైన పదునైన కథల వైపు ఆకర్షితులవుతున్నాం. అన్వితా దత్ - నెట్ ఫ్లిక్స్ తో మరోసారి కలిసి పని చేయడం ఎగ్జయిట్ చేస్తోంది. ఒక పాట లా ట్రైలర్ ఉవ్వెత్తున ఎమోషన్ ని రగిలిస్తోంది. వీక్షకులను ఖాలా జీవితం.. ఆమె కెరీర్ ఆలోచనలలోకి తీసుకువెళుతుంది. స్ట్రీమింగ్ భాగస్వామి నెట్ ఫ్లిక్స్ ద్వారా 190కి పైగా దేశాల్లోని గ్లోబల్ ప్రేక్షకులకు అందించేందుకు ప్రయత్నిస్తున్నాం. అంతర్లీన సందేశాన్ని అందించే కథతో రూపొందిన ఈ సినిమా చాలా ప్రత్యేకమైనది`` అని అన్నారు.
``ఖలా అనేది వ్యక్తిగత కల్లోలాలతో పోరాడుతూ వృత్తిపరమైన విజయాన్ని సాధించే గాయకురాలి భావోద్వేగ ప్రయాణం`` అని నెట్ ఫ్లిక్స్ ఇండియా హిందీ ఒరిజినల్ ఫిల్మ్స్ డైరెక్టర్ రుచికా కపూర్ అన్నారు. అన్వితా దత్ విభిన్నమైన కథాకథనంలో ట్రిప్తీ డిమ్రీ- స్వస్తిక ముఖర్జీ - బాబిల్ ఖాన్ అద్భుతంగా నటించారు. ఖలా అనేది యూనివర్సల్ థీమ్ తో అద్భుతమైన సంగీతం విజువల్స్ తో అందమైన కథతో అలరించేందుకు వస్తోంది అని వెల్లడించారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.