Begin typing your search above and press return to search.
విక్టోరియా ఆత్మ లేచొస్తుందేమో!
By: Tupaki Desk | 29 April 2019 10:37 AM GMTఅందాల చందమామ కాజల్ ని ఇలా చూశాక సమాధి నిదుర నుంచి విక్టోరియా రాణి ఆత్మ లేచొస్తుందేమో!! అంతగా స్ఫూర్తి నింపుతున్న ఈ కొత్త లుక్ కి యువతరం ఒకటే ఫిదా అయిపోతున్నారు. ఉన్నట్టుండి చందమామ ఇలా మారిపోయిందేం? అసలేమైంది? అని ఆరాలు తీస్తూ కంటికి కునుకు లేని సన్నివేశంలోకి వెళ్లిపోతున్నారు.
ఇంకాస్త వివరాల్లోకి వెళితే.. యునైటెడ్ కింగ్ డమ్ ఆఫ్ గ్రేట్ బ్రిటన్ (ఐర్లండ్) ని పాలించిన గ్రేట్ క్వీన్ విక్టోరియా జీవితంపై ప్రస్తుతం ఓ టీవీ సిరీస్ తెరకెక్కుతోంది. ప్రఖ్యాత సోని-ఇండియా చానెల్లో విక్టోరియా జీవితకథను ప్రత్యేక షోగా లాంచ్ చేయడం ఆసక్తికరం. ఇక ఈ వీడియోలకు ప్రత్యేకించి సోనీ తన వినియోగదారులకు ప్రీమియం ఆఫర్లతో అందించనుంది. అయితే విక్టోరియా జీవిత కథపై చందమామ స్పందిస్తూ .. ప్రపంచంలోనే అత్యంత ఆకర్షణీయమైన.. మోస్ట్ పవర్ ఫుల్ విక్టోరియా రాణిపై ఇలాంటి షోలు ఎంతో స్ఫూర్తిని నింపుతాయి. అందుకే నాకు నేనుగా ఇలా కిరీటం ధరించి మీ ముందుకు వచ్చాను.. అంటూ ఓ ఫోటోని అభిమానులకు షేర్ చేసింది.
ఈ ఫోటోలో అందాల చందమామ బులుగు జిలుగు డిజైనర్ డ్రెస్ లో మెరిసిపోయింది. ముఖ్యంగా ఆ డైమండ్ క్రిస్టల్ కిరీటం కాజల్ అందాన్ని రెట్టింపు చేసింది. ఇంకా చెప్పాలంటే కాజలేనా? లేక. విక్టోరియా మహారాణినా? అన్నంతగా కన్ఫ్యూజన్ లోకి నెట్టేసింది. ఒకవేళ విక్టోరియా బయోపిక్ తీస్తే అందులో కాజల్ కే ఛాన్సివ్వాలేమో!? ఆ ప్రయత్నం ఏ దర్శకుడైనా చేస్తాడంటారా? అన్నట్టు కాజల్ నటిస్తున్న `ప్యారిస్ ప్యారిస్` ఎప్పుడు రిలీజ్ కానుంది? `భారతీయుడు 2` సన్నివేశం ఏంటి? అన్నది తెలియాల్సి ఉందింకా.