Begin typing your search above and press return to search.
గ్రేటెస్ట్ డైరక్టర్.. ఇంకా రెండు సినిమాలే
By: Tupaki Desk | 5 Nov 2016 9:30 AM GMTక్వెంటిన్ టరాంటినో.. ప్రపంచ అత్యుత్తమ డైరెక్టర్లలో ఒకడు. గతేడాది 'ది హేట్ ఫుల్ ఎయిట్'మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈయన.. తాను రిటైర్మెంట్ తీసుకోబోతున్నట్లు చెప్పేశాడు.
తన రెండో చిత్రం పల్ప్ ఫిక్షన్(1994)కు.. 2012జాంగో అన్ చైన్డ్.. సినిమాలకు గాను బెస్ట్ స్క్రీన్ ప్లే విభాగంలో ఆస్కార్ అందుకున్నాడు టరాంటినో. అయితే.. ఈయన తీసిన ప్రతీ సినిమా ఎన్నెన్నో అవార్డులు దక్కించుకోవడం విశేషం. బెస్ట్ డైరెక్టర్.. బెస్ట్ స్క్రీన్ ప్లే.. వంటి ఎన్నో ఈయన ఖాతాలో ఉన్నాయి. తానింకా రెండు సినిమాలు మాత్రమే తీస్తానని టరాంటినో ప్రకటించడం అందరినీ షాక్ కి గురి చేసింది. 'త్వరలో మైక్ వదిలేస్తున్నా.. బూమ్' అంటూ అఫీషియల్ గా రిటైర్మెంట్ ను ప్రకటించాడు.
'సక్సెస్ ను నేను నిర్వచించినట్లుగానే కెరీర్ ను ముగించబోతున్నా. ప్రస్తుత తరంలో ఉత్తమ డైరెక్టర్లలో ఒకడిగా గుర్తింపు పొందాను. అదే నా అసలైన విజయం. కేవలం ఫిలిం మేకర్ గానే కాకుండా.. ఆర్టిస్ట్ గా కూడా ఎన్నో కీర్తి ప్రతిష్టలు పొందడం సంతోషంగా ఉంది' అంటున్నాడు గ్రేటెస్ట్ డైరెక్టర్ క్వెంటిన్ టరాంటినో.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/