Begin typing your search above and press return to search.
వరుణ్ తేజ్ కంట కన్నీరు కారింది
By: Tupaki Desk | 13 Nov 2016 4:07 PM GMTచేసిన సినిమాలు తక్కువే అయినా తనదైన ఇమేజ్ ను సృష్టించుకోవటంలో సఫలమయ్యారు నాగబాబు తనయుడు వరుణ్ తేజ్. తాను చేసే ప్రతి సినిమా భిన్నంగా ఉండాలన్నట్లుగా సినిమా ఎంపిక విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్న ఆయన.. తాజాగా షూటింగ్ లో కాలికి గాయమై ఇంటికే పరిమితం కావటం తెలిసిందే. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో కబుర్లు చెబుతూ.. నచ్చిన సినిమాలు చూస్తే గాయం నుంచి రికవరీ అవుతున్న వరుణ్ తాజాగా ఒక ప్రముఖ ఇంగ్లిషు మీడియా సంస్థకు ఒక భారీ ఇంటర్వ్యూను ఇచ్చారు.
ఈ సందర్భంగా ఆయన ఆసక్తికరమైన ముచ్చట్లను చెప్పుకొచ్చారు. పెద్దనాన్న చిరంజీవి.. బాబాయ్ పవన్ కల్యాణ్ తో తనకున్న అనుబంధంతో పాటు.. వారు తనపై ఎంత ప్రభావాన్ని చూపుతారన్న విషయాన్ని చెప్పుకొచ్చారు. చిన్నతనం నుంచి పెద్దనాన్నకు తాను చాలా సన్నిహితమని చెప్పిన వరుణ్ తేజ్.. తాను ఎప్పుడూ ఆయన దగ్గరే ఉండేవాడినని వ్యాఖ్యానించారు. కాలికి గాయమయ్యాక కూడా వారం రోజులుగా చిరు దగ్గరే ఉన్నట్లుగా ఆయన చెప్పుకొచ్చారు.
తామీ స్థాయికి రావటానికి చిరు పెద్దనాన్నే కారణంగా చెప్పిన వరుణ్ తేజ్ ఈ మధ్యన తనతో మాట్లాడిన సందర్భంగా పెద్దనాన్న వేసిన ఒక ప్రశ్న తన కంట్లో కన్నీరు తెప్పించిందన్న మాటను చెప్పారు. నటన గురించి వివరిస్తూ.. ప్రేక్షకుడు నీ మీద రూ.150 ఎందుకు ఖర్చు పెట్టాలో చెప్పాలని అడిగారట. ఆ ప్రశ్నకు తనకు ఏడుపొచ్చినట్లుగా వరుణ్ తేజ్ వెల్లడించారు.
ఇదిలా ఉంటే.. బాబాయ్ పవన్ కల్యాణ్ నుంచి తానెప్పుడూ స్ఫూర్తి పొందుతానని చెప్పారు. పవన్ తో తనకు చక్కటి అనుబంధం ఉందన్న వరుణ్.. సాయిధరమ్ కు ఆయనెన్నో విలువలు నేర్పించినట్లు పేర్కొన్నాడు. నీదైన ప్రత్యేకత ఉండేలా చూసుకోవాలని పవన్ తమకు ఎప్పుడూ చెబుతుంటారని వెల్లడించారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/