Begin typing your search above and press return to search.

పెరుగుతున్న భ‌ల్లాల భార్య ఎంక్వ‌యిరీ

By:  Tupaki Desk   |   4 May 2017 4:52 AM GMT
పెరుగుతున్న భ‌ల్లాల భార్య ఎంక్వ‌యిరీ
X
రికార్డుల్ని సృష్టిస్తూ.. విడుద‌లైన అన్నీ చోట్లా భారీ వ‌సూళ్ల‌నుసాధిస్తున్న‌ట్లుగా వార్త‌లు వ‌స్తున్న బాహుబ‌లిపై ప్ర‌శంస‌లే కాదు.. విమ‌ర్శ‌లు కూడా జోరుగా సాగుతున్నాయి. సినిమాలో ప్ర‌ధాన‌మైన లోపంగా ప్ర‌తినాయ‌కుడు భ‌ల్లాల‌దేవుడి భార్య క్యారెక్ట‌ర్‌ పై చ‌ర్చ అంత‌కంత‌కూ పెరుగుతోంది. రానా పోషించిన ఈ పాత్ర‌.. ప్ర‌బాస్ పోషించిన పాత్ర‌కు ధీటుగా నిల‌వ‌ట‌మే కాదు.. ఈ పాత్ర‌నుఛాలెంజింగ్ గా పోషించిన రానాపై ప‌లువురు ప్ర‌శంస‌లు వ్య‌క్తం చేస్తున్నారు.

బాహుబ‌లి 2 విడుద‌లైన త‌ర్వాత‌.. ఈ సినిమాలో లోపాలంటూ ప‌లు అంశాల్ని ప్ర‌స్తావిస్తున్న సంగ‌తి తెలిసిందే. అన్నింటికి మించి భ‌ల్లాల‌దేవుడి పాత్ర విష‌యంలో ద‌ర్శ‌కుడు భారీ త‌ప్పు చేసిన‌ట్లుగా అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. భ‌ల్లాల‌దేవుడి పెళ్లి ఎపిసోడ్ చూపించ‌క‌పోవ‌టం ఏమిట‌ని ప్ర‌శ్నిస్తున్నారు. ఒక‌వేళ పెళ్లి అన్న‌దే లేకుంటే కొడుకు ఎక్క‌డి నుంచి వ‌చ్చాడ‌ని? ప‌్రశ్నిస్తున్నారు. కొడుకు విష‌యంలో ఓకే అనుకుంటే.. భ‌ల్లాల‌దేవుడి భార్య ఎవ‌రు? అన్న‌ది ప్ర‌శ్న‌గా మారింది.

ఈ ప్ర‌శ్న మొద‌ట్లో వినిపించినా.. రోజులు గ‌డుస్తున్న కొద్దీ.. ఈ క్వ‌శ్చ‌న్ ను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేస్తున్న వారి సంఖ్య అంత‌కంత‌కూ పెరుగుతోంది. బాహుబ‌లి చిత్రంలో భ‌ల్లాల‌దేవుడి కొడుకు భ‌ద్ర పాత్ర‌లో యువ హీరో అడ‌వి శేష్ క‌నిపించ‌టం మ‌ర‌చిపోకూడ‌దు. సోష‌ల్ మీడియాలో అంత‌కంత‌కూ పెరుగుతున్న భ‌ల్లాల‌దేవుడి భార్య పాత్ర‌పై జ‌క్క‌న్న కాస్తంత క్లారిటీ ఇస్తే బాగుంటుందేమో?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/