Begin typing your search above and press return to search.
రివ్యూ రైటర్లకు ఉంది ముసళ్ల పండగ
By: Tupaki Desk | 4 Sep 2022 6:30 AM GMTసృష్టికి విరుద్ధంగా వెళ్లి ఏదో ఒకటి చేయడం కొందరికి అలవాటు. సినిమాలు చూసి సమీక్షలు రాసేవాళ్లలో ఇలాంటి వాళ్లు కూడా కొందరుంటారు!? అయితే అలాంటి వాళ్లతో ముప్పు ఎదుర్కొన్న ఒక యంగ్ ఆర్టిస్టు పగ ప్రతీకారం పేరుతో సదరు సమీక్షకులను చంపడం మొదలు పెడితే ఎలా ఉంటుంది? సినీ ఇండస్ట్రీలో రివ్యూ రైటర్లు అందరూ ఖాళీ అయిపోరూ? ఈ కథ వింటుంటేనే గగుర్పొడుస్తోంది. కానీ అలాంటి ఒక సైకో కిల్లర్ కథతో సినిమా తీస్తుండడం ఇంకా ఝలదరింపునకు గురి చేస్తోంది!
ప్యాడ్ మ్యాన్ - మిషన్ మంగళ్- పా- చీనికం-ఇంగ్లీష్ వింగ్లిష్ లాంటి క్లాసిక్స్ తెరకెక్కించిన R బాల్కీ `చుప్` పేరుతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ కథే వెరైటీగా ఉంది. అసలు రివ్యూ రైటర్లను చంపేయాలన్న ఆలోచన బాల్కీకి ఎలా వచ్చిందో కానీ అతడు కసి తీర్చుకుంటున్నట్టే కనిపిస్తోంది. అందరూ కేఆర్కే టైపులో ఉంటారా? అన్నది అటుంచితే.. అసలు సమీక్షకుల్ని చంపేస్తే ఆర్టిస్టుకి కసి చల్లారుతుందా? అన్నది కూడా డౌట్లు పెట్టేస్తోంది.
దర్శకనిర్మాత R బాల్కీ తన మూవీ కథ ఎంపిక గురించి మాట్లాడుతూ.. సినిమా లెజెండ్ గురుదత్ `చుప్: రివెంజ్ ఆఫ్ ది ఆర్టిస్ట్` కి సరైన రిఫరెన్స్ పాయింట్.. ఇది తప్పుడు సమీక్షలతో కలతకు గురైన కళాకారుడి బాధను వర్ణించే థ్రిల్లర్ అని వెల్లడించారు. దత్ 97వ జయంతి సందర్భంగా విడుదల చేసిన చుప్ టీజర్ ఆకట్టుకుంది. ఈ టీజర్ దివంగత ఆర్టిస్టు గురు దత్ చిత్రం `కాగజ్ కే ఫూల్`కి నివాళులర్పించింది. నటుడు దర్శకరచయితగా సుప్రసిద్ధుడైన గురుదత్ నాటి కాలంలో సమీక్షకుల నుంచి బోలెడన్ని ఇబ్బందులకు గురయ్యాడు. దానినే తెరపై చూపిస్తున్నారు.
దత్ - వహీదా రెహ్మాన్ ప్రధాన పాత్రల్లో నటించిన 1959 చిత్రం `కాగజ్ కే ఫూల్` విడుదలైన తర్వాత తీవ్ర విమర్శలకు గురైంది. తరువాత ప్రపంచ సినిమా క్లాసిక్ గా పునరుత్థానం సాధించుకుంది. తాజా మూవీ చుప్ స్క్రిప్ట్ లో గురుదత్ కి సంబంధించి చాలా విషయాలు ఉన్నాయి!! అని బాల్కీ తెలిపారు. అతడు రిషి విర్మణి .. విమర్శకుడిగా మారిన రచయిత రాజా సేన్ తో కలిసి `చుప్` కథ(స్క్రిప్టు)ను రచించారు.
మేం గురుదత్ నుంచి ప్రేరణ పొందాం. గురుదత్ సున్నితత్వం చాలావరకూ వెండి తెరపై చూపిస్తున్నాం. ఇది ఒక కళాకారుడి సున్నితత్వానికి సంబంధించినది. వీక్షకుడు లేదా అభిమానులను థియేటర్లకు రానీకుండా చేసే సమీక్షకుల వల్ల అన్యాయానికి గురైన కళాకారుడి కథను తెరపై చూపిస్తున్నాం. మీడియా అంటే ఏదీ? ప్రతిదీ మీడియా కాదు.. ఎలా పడితే అలా అభిప్రాయాన్ని రాసేయడానికి..``అని దర్శకుడు బాల్కీ అన్నారు.
`బాజీ`-ఆర్ పార్- మిస్టర్ & మిసెస్ 55-ప్యాసా వంటి హిట్ చిత్రాల తర్వాత దత్ దర్శకత్వం వహించిన ఎనిమిదో ప్రయత్నం `కాగజ్ కే ఫూల్`. ఈ చిత్రం ఒక వర్షకాలపు చిటపట చినుకుల సాయంత్రం పొరపాటున శాంతి (రెహ్మాన్)ని తన చిత్రంలో కథానాయికగా తీసుకున్న ఒంటరి సినీ దర్శకుడు సురేష్ (దత్) కథతో మొదలవుతుంది. విధి ఇచ్చిన క్రూరమైన ట్విస్ట్ లో శాంతి సూపర్ స్టార్ అవుతుంది. సురేష్ చిత్ర పరిశ్రమలోని ఉన్నత స్థాయి నుండి కిందికి పడిపోతాడు. తర్వాత ఏం జరిగింది? అతడి పతనంలో మీడియా పాత్ర ఎంత? అన్నది థ్రిల్లింగ్ మోడ్ లో చూపిస్తున్నారు.
`చుప్` కథాంశం ఆసక్తికరం. ఒక కళాకారుడు తమ సృష్టిని పబ్లిక్ గా ప్రదర్శించిన తర్వాత తప్పుడు సమీక్షకుల వల్ల మనసు గాయపడితే ఏమవుతుంది? అన్నది తెరపై చూపిస్తున్నాం. ఇది కళాకారుల సున్నితత్వం గురించిన సినిమా. తప్పుడు విమర్శలతో బాధపడిన గొప్ప కళాకారులలో గురుదత్ సాబ్ ఒకరు. ఇప్పుడు అదే సంఘం మనమంతా `కాగజ్ కే ఫూల్`ని `మాస్టర్ పీస్` అని పిలుస్తున్నాము. ఇది విడ్డూరం. ఆ సమయంలో(రిలీజ్ డే) ఆ వ్యక్తి (ఆర్టిస్టు దత్) ఎంతగా బాధపడ్డాడు? అన్నది కూడా మనం పరిశీలించాలి అని బాల్కీ అన్నారు.
షోలే ఉదాహరణను ఉటంకిస్తూ ప్రపంచవ్యాప్తంగా ``గొప్ప సినిమాలను చెత్త`` అన్నవారున్నారని కూడా గుర్తు చేసారు. ఇది సినిమా మాత్రమే కాదు.. ఇది పుస్తకాలు... ప్రకటనలు.. వాస్తుశిల్పం మొదలైన వాటి గురించి తప్పుడుగా రాసిన సమీక్షకుల గురించి అని కూడా వెల్లడించారు.
ప్రజలు (సమీక్షకులు) తమ అభిప్రాయాలను వెల్లడించేటప్పుడు సున్నితత్వం కలిగి ఉండరని నేను నమ్ముతాను. ఈ రోజు ఈ ప్రపంచంలో సూర్యుని నీడలో ఉన్న ప్రతిదానిని మనం విమర్శిస్తున్నాం. ఆహారం.. ఒకరి రూపం.. రచన లేదా పని మొదలైనవాటిని స్వేచ్ఛగా విమర్శిస్తాం అని అన్నారు.
దుల్కర్ సల్మాన్- సన్నీ డియోల్- శ్రేయ ధన్వంతరి- పూజా భట్ నటించిన `చుప్` బాల్కీకి మొదటి థ్రిల్లర్ ప్రాజెక్ట్. చీనీ కమ్-పా-ప్యాడ్ మాన్ చిత్రాలతో పాపులరైన బాల్కీ కొత్త శైలిని అన్వేషించడం అచేతనంగా సాగిన నిర్ణయం కాదని అన్నారు. నేను జానర్ లను బ్రేక్ చేయడానికి లేదా నేను చేయనిదాన్ని ప్రయత్నించడానికి సినిమాలు తీయను. నాకు తెలిసినంత వరకు ఎక్కడా చెప్పని కథలను నేను చూస్తున్నాను. కాబట్టి అది ఏ జానర్ లో పడితే అది అలా వర్కవుట్ అవుతుంది. `చుప్` కమర్షియల్ ఫార్మాట్ లో సాగే హార్డ్ కోర్ థ్రిల్లర్ అని అన్నారు.
దుల్కార్ సల్మాన్ చుప్ లో ప్రధాన పాత్రలో నటించారు. బాల్కీ తన ఫేవరెట్ నటుడు మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఈ చిత్రంలో అతిధి పాత్రలో కనిపిస్తారని కూడా వెల్లడించారు. ఈ జోడీ గతంలో చీనీ కమ్-పా-షమితాబ్ చిత్రాలకు పనిచేశారు. చుప్ చిత్రాన్ని హోప్ ఫిల్మ్ మేకర్స్- జయంతిలాల్ గడా పెన్ స్టూడియోస్ నిర్మించాయి.