Begin typing your search above and press return to search.
నటవారసుల్ని వెనకేసుకొస్తే ఛాన్సులిస్తారా?
By: Tupaki Desk | 20 July 2020 3:30 AM GMTనటవారసుల (నెపోటిజం) గురించి .. ఇండస్ట్రీ మాఫియాల గురించి అన్ని పరిశ్రమల్లోనూ ఆసక్తికర చర్చ సాగుతోంది. `బాబు గారూ` అంటూ పిలిచేది నెపోటిజం స్టార్లనే. పేరు చివర బాబు? ఎందుకు అంటే అది ఎగ్జిస్టెడ్ .. సౌకర్యం అని చెబుతారు. అంతేనా అది వారసత్వంగా వచ్చిన సంపద. ఒక వెటరన్ స్టార్ కి ఇచ్చే గౌరవం ఇదని భావించినా కానీ.. కాలక్రమంలో నెపోటిజాన్ని కాపాడుకునే ఒక మాఫియాలా తయారై బయటి ప్రతిభను తొక్కేస్తోందన్న అభిప్రాయం బలపడింది.
ఇండస్ట్రీలో కుట్రలు పలు సందర్భాల్లో బయటపడుతూనే ఉన్నాయి. పరిశ్రమలో తాము బతుకుతూ ఇతరులను బతకనివ్వడం అనే ప్రాతిపదిక లేకపోవడమే దీనంతటికీ కారణం. ఇది కేవలం బాలీవుడ్ లోనే కాదు అన్ని సినీపరిశ్రమల్లోనూ ఉంటుంది. అయితే ఉత్తరాదిన ఇది మరీ ఎక్కువగా ఉండడం వల్లనే హీరోల ఆత్మహత్యలు కలతకు గురి చేస్తున్నాయన్నది అభిమానులతో పాటు ఇండస్ట్రీ ఇన్ సైడ్ వ్యక్తులు చెబుతున్న మాట.
ఇక ఇప్పటికే సుశాంత్ సింగ్ ఆత్మహత్య తర్వాత ఇదో పెద్ద డిబేట్ గా మారింది. కంగన.. శేఖర్ సుమన్.. వంటి ప్రముఖులు నెపోటిజాన్ని తూర్పారబడుతున్నారు. సుశాంత్ ఆత్మహత్యకు ఇండస్ట్రీ మాఫియానే కారణని వీళ్లంతా వాదిస్తున్నారు. నటవారసుల కుట్రల్ని బయటపెడుతున్నారు. అయితే దీనికి వ్యతిరేకంగా దక్షిణాది దర్శకుడు ఆర్.బాల్కీ చేసిన కామెంట్ ప్రస్తుతం విమర్శలకు తావిచ్చింది. నటవారసత్వం అన్నది తొలి సినిమా వరకే. ఆ తర్వాత ఎదగాలంటే ప్రతిభ చాలా అవసరం అని మంచి మాట చెప్పిన ఆయన .. అయినా రణబీర్ - ఆలియా లాంటి ట్యాలెంటెడ్ స్టార్లు వేరొకరు ఉంటే చూపించండి! అంటూ అనవసర వ్యాఖ్యను చేసి బుక్కయ్యారు. అంటే నటవారసులిద్దరినీ వెనకేసుకురావడం వెనక కారణం ఏమై ఉంటుందో ఎవరైనా ఇట్టే అర్థం చేసుకోవచ్చు.
బాలీవుడ్ మాఫియాలపై అవగాహన ఉన్నవాడిగా.. నటవారసులను వెనకేసుకు రావడం ద్వారా వాళ్ల మెప్పు పొంది అవకాశం పొందాలనే ఆలోచన ఏదైనా ఉందా? అంటూ అభిమానులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే బాల్కీ పా- షమితాబ్- ప్యాడ్ మ్యాన్ లాంటి ఇంట్రెస్టింగ్ సినిమాలతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న మేధో వర్గానికి చెందిన దర్శకుడు. ఆయన ఇలా అనడం ఏం బాలేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ధీరూభాయ్ వారసుడు ముఖేష్ అంబానీ రిలయన్స్ సామ్రాజ్యాన్ని నడిపించగలరు కానీ వేరొకరు రారు అని ఆయన అన్నారు. నిజమే కానీ.. నటవారసుల్ని ఇలాంటి రాంగ్ టైమ్ లో అలా వెనకేసుకు రావాల్సిన అవసరం ఏం ఉంటుంది?