Begin typing your search above and press return to search.

#BIGGBOSS5TELUGU : కాజల్‌ గారు కాస్త తగ్గించాలండి

By:  Tupaki Desk   |   7 Sep 2021 6:30 AM
#BIGGBOSS5TELUGU : కాజల్‌ గారు కాస్త తగ్గించాలండి
X
బిగ్ బాస్‌ హౌస్‌ లో ఈసారి విభిన్న రకాల మనస్థత్వాల వారు జాయిన్ అయ్యారు. వారిలో అందరికి సుపరిచితురాలు అయిన ఆర్‌ జే కాజల్ ఒకరు. రేడియో వినే వారికి కాజల్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆమె సుదీర్ఘ కాలంగా ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తున్నారు. ఆమె మాటల ప్రవాహం అలా అలా కొనసాగుతూనే ఉంటుంది. ఎప్పటికప్పుడు ఆమె కొత్తగా విషయాలను వ్యక్తం చేసేందుకు తనదైన ప్రత్యేక శైలిలో సంభాషణలు సాగిస్తుంది. అందుకే ఆర్‌ జే కాజల్‌ కు మంచి గుర్తింపు ఉంది. బిగ్‌ బాస్‌ సీజన్ 5 లో ఆర్‌ జే కాజల్‌ అంటూ చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి. వార్తలు వచ్చినట్లుగానే ఆమె కు బిగ్‌ బాస్ లో ఛాన్స్ దక్కింది. ఆమె ఎంట్రీ ఇచ్చిన రోజు తర్వాత రోజు ఆమె మరీ ఎక్కువ యాక్టివ్‌ గా ఉందంటూ నెటిజన్స్‌ నుండి కామెంట్స్ వస్తున్నాయి.

తెలుగు బిగ్‌ బాస్ హౌస్ లో ఉన్న అమ్మాయిల్లో ముగ్గురు నలుగురు ఖచ్చితంగా ఫైనల్‌ 5 కు అర్హులు అన్నట్లుగా అప్పుడే ప్రేక్షకులు ఒక అభిప్రాయంకు వచ్చేశారు. అందులో కాజల్‌ కూడా ఉంటుంది అనడంలో సందేహం లేదు. అయితే ఆమె ప్రతి విషయంలో కూడా కాస్త ఎక్కువ చొరవ చూపిస్తున్నారు అనే కామెంట్స్ వచ్చేస్తున్నాయి. గతంలో వచ్చిన బిగ్‌ బాస్ సీజన్‌ లు అన్ని చూసేసి ఇతర భాషల్లో వచ్చిన బిగ్‌ బాస్ ను కూడా చూసి చాలా యాక్టివ్ గా ఆమె వ్యవహరిస్తున్నారు అనడంలో సందేహం లేదు. ఆ విషయాన్ని ఆమె కూడా ఒప్పేసుకుంది. చిన్నప్పటి నుండి బిగ్ బాస్‌ చూస్తూ పెరిగాను... నాకు బిగ్ బాస్ అంటే చాలా ఇష్టం. నా కల నెరవేరింది అన్నట్లుగా వ్యాఖ్యలు చేసింది.

ఆమెకు బిగ్‌ బాస్ పై ఇష్టంతో మొత్తం స్టడీ చేసిందని కంటెస్టెంట్స్ అందరికి తెలిసి పోయింది. దాంతో ఆమె పట్ల జాగ్రత్తగా ఉండాలని ముందుగానే అనుకుంటున్నారు. కనుక ఆమెకు రిస్క్‌ అయ్యే అవకాశాలు లేకపోలేదు. అందుకే బిగ్‌ బాస్ లో ఆమె మనుగడ ఎక్కువ కాలం ఉండాలంటే అత్యుత్సాహం చూపించకుండా ఉండాలి.. ప్రతి విషయంలో కూడా ఎగ్జైట్ అవ్వకూడదు.. ప్రతి ఒక్కరితో మంచిగా ఉండాలని భావించడం కూడా మంచిది కాదు. కనుక కాజల్‌ ఈ విషయాలను కాస్త దృష్టిలో పెట్టుకుంటే ఆమెకు ఖచ్చితంగా బిగ్‌ బాస్ లో మంచి ఆధరణ ఉంటుంది అనేది విశ్లేషకుల అభిప్రాయం.