Begin typing your search above and press return to search.
మాధవన్ సినిమాకు సపోర్ట్ గా క్రేజీ ప్రొడక్షన్స్ కంపనీస్
By: Tupaki Desk | 15 Feb 2022 3:30 AM GMTరొమాంటిక్ లవ్ స్టోరీస్ లతో హీరోగా మంచి పేరు తెచ్చుకున్న మాధవన్ కాస్త జోరు తగ్గించారు. `సలా ఖడూస్` చితరువాత తెలుగులో విలన్ పాత్రల్లో మెరిసన మాధవన్ ప్రస్తుతం ఇస్రో శాస్త్ర వేత్త నంబి నారాయణన్ లైఫ్ స్టోరీ ఆధారంగా రూపొందుతున్న `రాకెట్రీ : ది నంబి ఎఫెక్ట్` చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో నటించడమే కాకుండా ఆయనే స్వయంగా డైరెక్ట్ చేస్తున్నారు. నిర్మాణంలోనూ వర్గీస్ మూలన్, విజయ్ మూలన్ లతో కలిసి భాగస్వామిగా వ్యవహరిస్తున్నారు.
తమిళ వెర్షన్ లో సూర్య, హిందీ వెర్షన్ లో బాలీవుడ్ హీరో షారుక్ ఖాన్ అతిథి పాత్రల్లో నటించారు. దేశం కోసం అహర్నిశం శ్రమించిన ఏరో స్పేస్ ఇంజినీర్ నంబి నారాయణన్ ని దేశ ద్రోహిగా చిత్రించి ఆయనపై అనేక అభియోగాలు మోపిన విషయం తెలిసిందే.
అయితే ఆయన దేశ ద్రోహి కాదని, దేశ భక్తుడని తేలడం, దేశం ఆయనపై నమోదైన అపోహలని నిజాలుగా నమ్మి దేశ ద్రోహి ముద్ర వేసిందని తేలడం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అలాంటి వ్యక్తి కథని అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరపైకి తీసుకొచ్చారు హీరో మాధవన్.
తాజాగా ఈ చిత్ర రిలీజ్ డేట్ ని మాధవన్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. తమిళ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో ఏక కాలంలో రూపొందిన ఈ మూవీని తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ విడుదల చేయబోతున్నారు.
ఈ ఏడాది జూలై 1న ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. గత ఏడాది ఏప్రిల్ 1న ఈ మూవీ ట్రైలర్ ని తెలుగు, తమిళ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో విడుదల చేశారు. ముందు ఈ ఏడాది ఏప్రిల్ 1న విడుదల చేయాలని ప్లాన్ చేశారు.
కానీ తాజా పరిణామాల నేపథ్యంలో ఈ మూవీని జూలై 1కి వాయిదా వేశారు. ట్రైలర్ ఇప్పటికే సినిమాపై అంచనాల్ని పెంచేసింది. దేశం కోసం తన మేథోసంపత్తితో సరికొత్త రాకెట్ లని అందించి ప్రపంచ పటంలో తిరుగులేని శక్తిగా నిలబెట్టాలని ప్రయత్నించిన నంబి నారాయణన్ ని ఎందుకు దేశ ద్రోహిగా చిత్రీకరించారు? .. దాని వెనక వున్నది ఎవరు? ..అనే విషయాలని వివరంగా వెల్లడిస్తూ మాధవన్ తెరకెక్కించిన ఈ మూవీ వరల్డ్ వైడ్ గా సంచలనాలు సృష్టించేలా కనిపిస్తోంది.
ఈ విషయాన్ని బలంగా నమ్మిన బాలీవుడ్ క్రేజీ ప్రొడక్షన్ కంపనీలు యశ్‌రాజ్ ఫిల్మ్స్, ఫార్స్ ఫిల్మ్ సంస్థలు ఇంటర్నేషనల్ మార్కెట్ లో డిస్ట్రిబ్యూట్ చేయబోతున్నాయి. రిలీజ్ డేట్ కి సంబంధించిన ఓ వీడియోని పోస్ట్ చేస్తూ మాధవన్ ఈ విషయాన్ని స్పష్టం చేశారు.

హిందీ వెర్షన్ ని షారుక్ ఖాన్ కి సంబంధించిన రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ రిలీజ్ చేస్తోంది. మాధవన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ మూవీలో కీలక పాత్రల్లో సిమ్రన్ - రజిత్ కపూర్ - రవి రాఘవేంద్ర - మిష కపూర్ - కార్తీక్ కుమార్ - గుల్షన్ గ్రోవర్ - దినేష్ ప్రభాకర్ తదితరులు నటిస్తున్నారు.