Begin typing your search above and press return to search.
సర్జరీ తరువాత కూడా అదే స్మైల్
By: Tupaki Desk | 27 Feb 2018 9:33 AM GMTమాధవన్... సఖి సినిమాలో తన నవ్వుతోనే అమ్మాయిల గుండెలు కొల్లగొట్టాడు. అప్పట్నించి భాషా బేధం లేకుండా తమిళ - హిందీ - కన్నడ - ఇంగ్లీష్ - తెలుగు సినీ ఇండస్ట్రీలో నటిస్తూనే ఉన్నాడు. కొన్ని గంటల క్రితమే మాధవన్ భుజానికి ఆపరేషన్ జరిగింది. ఆసుపత్రి బెడ్ పై పడుకున్న మాధవన్ ట్విట్టర్ లో తన పరిస్థితిని అభిమానులకు చేరవేశారు.
ఆసుపత్రి బెడ్ పై పడుకుని ఉన్న మాధవన్ చక్కని నవ్వుతో ఫోటో దిగి... ‘భుజానికి ఆపరేషన్ జరిగింది. ఫైటర్ మళ్లీ ట్రాక్ లోకి వచ్చశాడు. కుడి చేతి స్పర్శ మాత్రం ఇంకా తెలియడం లేదు’ అని క్యాప్షన్ పెట్టి ఫోటోను పోస్టు చేశాడు. అతడి పోస్టుకు అభిమానులు వెల్లువలా రీట్వీట్లు చేస్తున్నారు. సర్జరీ తరువాత కూడా అదే స్మైల్ అంటూ ఒక అభిమాని మెసేజ్ పెట్టాడు. మరికొందరు త్వరగా కోలుకోవాలంటూ రీట్వీట్ చేశారు. ప్రస్తుతం మాధవన్ తెలుగులో సవ్యసాచి సినిమాలో నటిస్తున్నాడు. ఇందులో నాగచైతన్య హీరోగా... నిధి అగర్వాల్ నాయికగా నటిస్తున్నారు. మాధవన్ తో పాటూ భూమిక సినిమాలో కీలకపాత్ర పోషిస్తోంది. ఈ మార్చిలోనే ఈ సినిమా విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.
ఏమాయ చేశావే ఫేం గౌతమ్ వాసుదేవ మీనన్ త్వరలో తీయబోయే సినిమాలో కూడా మాధవన్ నటించబోతున్నాడు. ఏమాయ చేశావే సీక్వెల్ గా ఈ సినిమా రాబోతోంది. గౌతమ్ తో మాధవన్ 2001లో చెలి చిత్రంలో నటించారు. రీమా సేన్ ఇందులో హీరోయిన్. ఈ సినిమా కూడా సూపర్ హిట్ అయ్యింది. మళ్లీ వీరిద్దరి కాంబోలో సినిమా రాబోతోంది. ఏ మాయ చేశావే సీక్వెల్ కోసం తెలుగులో ఏ హీరోను ఎంచుకుంటాడో గౌతమ్ చూడాలి. మాధవన్ కేవలం తమిళ్ లేదా హిందీకే పరిమితమయ్యే అవకాశం ఉంది.