Begin typing your search above and press return to search.
దండకారణ్యంలో ప్రజా నాయకుడు
By: Tupaki Desk | 4 July 2015 5:30 PM GMTసినిమా హిట్ అయిందా.. ఫట్ అయిందా.. ఎంత వసూలు చేసింది.. ఇలాంటివన్నీ ఈయనకేం పట్టవు. ఏదో ఒక ప్రజా సమస్య వుందంటే చాలు దాని గురించి తెలుసుకొని సినిమా మాధ్యమంగా దానికి ఓ రకమైన పరిష్కారాన్ని సూచించే ప్రయత్నం చేస్తుంటారు ఆర్.నారాయణమూర్తి. అందుకే ఆయన కథా నాయకుడిగా కాక ప్రజా నాయకుడిగా గుర్తింపు పొందారు.
ఆ కోవలోనే ప్రస్తుతం దండకారణ్యం అనే సినిమాకి శ్రీకారం చుట్టారీ దర్శక నిర్మాత. ఎప్పటిలాగే ఈ సినిమాలోనూ తానే ప్రధాన పాత్రధారిగా తన సొంత బ్యానర్ స్నేహ చిత్ర పిక్చర్స్ నిర్మించనున్న ఈ సినిమాలో ''యుగయుగాలుగా ఎంతోమందికి తల్లిలా నీడనిచ్చిన అడవిలో తుపాకుల మోతలు వుండరాదనే" సందేశాన్నిచూపించనున్నారట. విజయనగరం, విశాఖ, బొబ్బిలి, రాయఘడ్, చత్తీస్ ఘడ్ అటవీ ప్రాంతాలలో షూటింగ్ జరుగనున్న ఈ సినిమాలో నారాయణమూర్తి గత సినిమాల్లానే అక్కడి వారినే నటులుగా తీసుకుని ఈ సినిమాని చేయనున్నారు. సాహిత్యం కూడా ప్రజాకవులే అందిస్తున్నారు. క్రిస్టమస్ సందర్భంగా డిసెంబర్ 25న విడుదల చేస్తామని రిలీజ్ డేట్ ప్రకటించడం విశేషం.