Begin typing your search above and press return to search.
దాసరికి పద్మవిభూషణ్ ఇవ్వాలి
By: Tupaki Desk | 6 May 2019 4:39 AM GMTదర్శకరత్న డా.దాసరి నారాయణరావు జయంతి సందర్భంగా ఆయన శిష్యులు రకరకాల కార్యక్రమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. దాసరి మెమోరియల్ అవార్డ్స్ 2019 పేరుతో తుమ్మలపల్లి రామసత్యనారాయణ అవార్డుల్ని అందించారు. అలాగే దాసరి టాలెంట్ అకాడమీ లఘు చిత్రాల పోటీ-2019 పేరుతో పలువురిని పురస్కారాలకు ఎంపిక చేసి ప్రైజ్ మనీతో సత్కరించారు. ఈ సందర్భంగా ప్రసాద్ లాబ్స్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో దాసరి ప్రియశిష్యుడు దర్శకరచయిత- నటుడు ఆర్.నారాయణమూర్తి మాట్లాడుతూ దాసరికి పద్మవిభూషణ్ వచ్చేలా రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కృషి చేయాలని మీడియా ముఖంగా కోరారు.
పరిశ్రమలో దశాబ్ధాల అనుభవం ఉన్న ఆయన ప్రతి సందర్భంలో ప్రభుత్వాలచే విస్మరించబడిన తెలుగు ప్రతిభను గుర్తు చేస్తుంటారు. ఇదివరకూ ఎన్టీఆర్ కి భారత రత్న ఇవ్వాలని నారాయణమూర్తి పదే పదే ప్రభుత్వాల దృష్టికి చేరేలా వేదికలపై ప్రశ్నించారు. అయితే ఆయన అడిగేది ఏదీ.. ఫలించేలా లేదు. అర్హులకు పద్మాలు దక్కలేదన్న వాదన ఎప్పుడూ ఉంటోంది. ఇకపోతే ఇప్పటివరకూ సౌత్ సినీపరిశ్రమలో పద్మాలు అందుకున్న ప్రముఖుల జాబితా పరిశీలిస్తే...
లెజెండ్ అక్కినేని నాగేశ్వరరావుకు పద్మభూషణ్.. పద్మవిభూషణ్ పురస్కారాలు దక్కాయి. సూపర్ స్టార్ కృష్ణ పద్మభూషణ్ అందుకున్నారు. అతిలోక సుందరి శ్రీదేవికి మరణానంతరం ప్రభుత్వం పద్మశ్రీ ప్రకటించింది. వేలాది పాటలతో ప్రపంచాన్ని తనదైన శైలిలో ఓలలాడించిన గానగంధర్వుడు ఎస్.పి.బాలసుబ్రమణ్యంకు పద్మశ్రీతో పాటు పద్మభూషణ్ దక్కింది. 150 చిత్రాల మెగాస్టార్ చిరంజీవికి పద్మ భూషణ్ గౌరవం దక్కింది. సూపర్ స్టార్ రజనీకాంత్ - పద్మభూషణ్.. పద్మవిభూషణ్ రెండూ అందుకున్నారు. విలక్షణ నటుడు కమల్ హాసన్ పద్మశ్రీ.. పద్మభూషణ్ అందుకున్న అరుదైన నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. మోహన్ బాబు- బ్రహ్మానందం- టబు వంటి స్టార్లకు పద్మశ్రీ దక్కింది. మునుముందు పద్మ పురస్కారాల గౌరవం ఎవరెవరికి దక్కనుందో వేచి చూడాలి.
దాసరి టాలెంట్ అకాడమీ `షార్ట్ ఫిలిం కాంటెస్ట్` కార్యక్రమంలో అవార్డుల వ్యవస్థాపకులు బి.ఎస్.ఎన్.సూర్యనారాయణను మోహన్ బాబు- జయసుధ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో దాసరి టాలెంట్ అకాడమీ వారు సూచించిన ఒక స్టూడెంట్ కి తమ విద్యా సంస్థలో ఎల్.కె.జీ నుంచి ప్లస్ టు వరకు ఉచిత విద్య అందిస్తామని మోహన్ బాబు ప్రకటించారు. దాసరికి నివాళిగా తలపెట్టిన షార్ట్ ఫిలిం కాంటెస్ట్ ను ప్రతి ఏడాది కొనసాగిస్తామని దాసరి టాలెంట్ అకాడమీ వ్యవస్థాపకులు బి.ఎస్.ఎన్.సూర్యనారాయణ అన్నారు.