Begin typing your search above and press return to search.
నారాయణమూర్తి సినిమాలకు పెట్టుబడి ఎలా?
By: Tupaki Desk | 16 Nov 2016 10:30 PM GMTజయాపజయాలతో సంబంధం లేకుండా తన దారిలో తాను సినిమాలు చేస్తుంటారు ఆర్.నారాయణమూర్తి. ఆయన కమిట్మెంట్ కు ఎవరైనా హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. ఐతే కేవలం కమిట్మెంట్ ఉంటే సినిమా పూర్తవదు. ఎంత లో బడ్జెట్లో తీసినా సినిమాకు డబ్బులు కావాల్సిందే. ఎవరో ఒకరు పెట్టుబడి పెట్టాల్సిందే. కానీ నారాయణ మూర్తి మాత్రం తనే సినిమాలు నిర్మిస్తుంటారు. ఐతే ఆయన సినిమాలు ఎంత వరకు వసూళ్లు రాబడతాయి. ఆయనకు ఏమాత్రం డబ్బులు మిగులుస్తాయి.. తర్వాతి సినిమాకు ఏమాత్రం పెట్టుబడి సమకూరుస్తాయి అన్నది సందేహమే. మరి నారాయణమూర్తి ఎలా నెట్టుకొస్తున్నాడు.. ఇంతకీ ఆయన ఆర్థిక పరిస్థితి ఏంటి.. ఇలాంటి సందేహాలు జనాల్లో ఉన్నాయి. తాజాగా ఒక ఇంటర్వ్యూలో వీటికి బదులిచ్చారు నారాయణమూర్తి.
‘‘అర్ధరాత్రి స్వతంత్రం దగ్గర్నుంచి ‘వేగు చుక్కలు’ వరకూ 20 ఏళ్ల పాటు నేను తీసిన సినిమాలన్నీ బ్రహ్మాండంగా ఆడాయి. ఇప్పటికీ అలాంటి సినిమాలే తీస్తున్నా. సముద్రాన్ని ఈదుతూనే ఉన్నా. జనం దయ నాపై ఉంది కాబట్టి విజయవంతమవుతున్నా. మొదట్నుంచీ నా స్నేహితులే నాకు సాయం చేస్తున్నారు. కథ.. స్క్రీన్‌ప్లే.. యాక్షన్.. డెరైక్షన్.. మ్యూజిక్.. అన్నీ నేనే కాబట్టి బడ్జెట్ అక్కడే తగ్గిపోతుంది. సినిమా మొదలుపెట్టే ముందు నా స్నేహితుల దగ్గర్నుంచి అప్పు తెచ్చుకుంటా. రిలీజయ్యాక తిరిగిచ్చేస్తా. నేను ఏమీ లేనివాడిని కాదు. సిల్వర్ జూబ్లీ సినిమాలు తీసినవాడిని. కోట్లు గడించినవాడిని. నా దగ్గర బ్యాంక్ బ్యాలెన్స్ ఎందుకు ఉండకూడదు. ఐతే నాకు సింపుల్ గా ఉండటం అలవాటు. కాలేజీ రోజుల నుంచి నాకు రెండు జతల బట్టలే ఉండేవి. వాచీలు.. గొలుసులు ఎప్పుడూ పెట్టుకోలేదు. నా సినిమా కోట్లు తెచ్చినప్పుడు నాకు బీరువా లేదు.. డాక్యుమెంట్లు లేవు.. చాప దిండు మాత్రమే ఉన్నాయి. నా సినిమాలు డబ్బులు తేనప్పుడూ నా దగ్గర అవే ఉన్నాయి’’ అని నారాయణమూర్తి తెలిపాడు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/