Begin typing your search above and press return to search.
నారాయణమూర్తిలో దాగిన రహస్యం
By: Tupaki Desk | 26 Jun 2015 4:01 AM GMTఏరోజుకారోజు ఫుడ్డు కోసం లాటరీ కొట్టే పేదల్నే సిసలైన ప్రజలు అంటారు. ఇది కమ్యూనిస్టులు నమ్మే సిద్ధాంతం. ఇలాంటి వాళ్లకోసమే సినిమాలు తీసేందుకు పుట్టారు ఆర్.నారాయణమూర్తి. పల్లెలు, పేదలు, అనుబంధాలు, కష్టాలు, కన్నీళ్లే ఆయన కథలు. పేదరికం నుంచే ఉద్యమాలు పుడతాయని చెబుతుంటాడు. అందుకే నారాయణమూర్తిని పీపుల్స్ స్టార్ అని పిలుస్తారు.
ఎన్టీఆర్, ఏఎన్నార్ హీరోలుగా రాజ్యమేలుతున్న రోజుల్లోనే ఆయన హీరో అయ్యారు. అప్పట్నుంచి మూడు దశాబ్ధాలుగా పరిశ్రమలో హీరోగానే కొనసాగుతున్నారు తప్ప సహాయనటుడిగానో, అతిధిగానో ఏదైనా పెద్ద సినిమాలో కనిపించిందే లేదు. అయితే నారాయణమూర్తిని వెతుక్కుంటూ బోలెడన్ని అవకాశాలొచ్చినా వాటిని తృణప్రాయంగా వదులుకున్నారాయన.
ఇదే విషయంపై ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నారాయణమూర్తి ఏమన్నారంటే.. ఏఎన్నార్, ఎన్టీఆర్‌లకు వీరాభిమానిని. వైవిధ్యం, విలక్షణత ఉన్న హీరోగా ఎన్టీఆర్ ఫేమస్. వాళ్ల ముందు నేను ఎంతో చిన్నవాడిని. అయినా హీరోగా నాకంటూ ఓ బ్రాండ్ ఉంది. అందుకే నేను వేరొక హీరో సినిమాలో నటించడానికి ఇష్టపడలేదు. పైగా నా సినిమాలకంటూ ప్రత్యేక పంథా ఉంది. రొటీన్ కమర్షియల్ సినిమాల్లో నటించను. అంతే తప్ప ఈగో సమస్య కాదని క్లారిటీనిచ్చారు.
అమితాబ్ బచ్చన్ అంతటివాడే సైడు పాత్రల్లో నటించాడు. ఏఎన్నార్, ఎన్టీఆర్‌లే హీరోలు కాని పాత్రల్లో చేశారు. కానీ నేను చేయకపోవడానికి కారణం వేరే. నేను కింది నుంచే ఎదిగాను. హీరోగా స్టాటస్ సంపాదించాను. దీన్ని ఇలాగే కొనసాగించాలనుకున్నా. అందుకే పెద్ద హీరోల సినిమాల్లో అవకాశాలు వచ్చినా వదులుకున్నానని చెప్పారు. పూరి దర్శకత్వంలో టెంపర్‌లో నటించే అవకాశం వచ్చినా వదులుకోవడానికి కారణం అదేనని చెప్పారు.
భగభగ మండే ఎర్ర సూరీడు కమర్షియాలిటీకి లొంగడు. ఇంకా చెప్పాలంటే దేనికీ లొంగనివాడు నారాయణమూర్తి. అదీ సంగతి.