Begin typing your search above and press return to search.

హ్యాట్సాఫ్ టు జ‌గ‌న‌న్నా.. చిన్న సినిమాని బ‌తికించారు!

By:  Tupaki Desk   |   7 March 2022 4:51 PM GMT
హ్యాట్సాఫ్ టు జ‌గ‌న‌న్నా.. చిన్న సినిమాని బ‌తికించారు!
X
పెద్ద సినిమాల కోసం చిన్న సినిమా బాగా ఆడుతున్నా థియేట‌ర్ల నుంచి తొల‌గించిన స‌న్నివేశాలు ఎన్నో. దీనిపై చాలాసార్లు చాలా మంది చిన్న నిర్మాత‌లు ల‌బోదిబోమ‌న్నారు. వీటికి థియేట‌ర్లు ఇచ్చేవాళ్లు కరువే. వీట‌న్నిటి పైనా గ్రూపులు క‌ట్టి ఉద్య‌మాలు చేశారు.

కానీ వాటిని ఎవ‌రూ ప‌ట్టించుకోలేదు. బ‌ల‌వంతుడిదే ఇక్క‌డ సామ్రాజ్యం అన్న‌ట్టే న‌డిచింది. దీనిపై ద‌ర్శ‌క‌ర‌త్న డా.దాస‌రి నారాయ‌ణ‌రావు చాలాసార్లు త‌న‌దైన పెద్ద‌రికంతో గ‌ర్జించారు. అయినా కానీ చిన్న సినిమా ఫేట్ మార‌లేదు.

మెగాస్టార్ చిరంజీవి స‌హా చాలా మంది చాలా సార్లు చిన్న సినిమా ఔన్న‌త్యం గురించి బాగు గురించి ఎంతో గొప్ప‌గా ప్ర‌స్థావించినా కానీ ఆ దిశ‌గా ఏదీ ప్రాక్టిక‌ల్ గా జ‌ర‌గ‌లేదు. కానీ ఇన్నాళ్టికి జ‌గ‌న‌న్న వ‌ల్ల సాధ్య‌మైంది. ఏపీ సీఎం వైయ‌స్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్ర‌భుత్వం ఎంతో ఉదారంగా చిన్న సినిమాకి వ‌రం అందించింది. ఇక‌పై ఐదో ఆట‌గా చిన్న సినిమాని ఆడించాలి. పెద్ద సినిమాలు ఉన్నా కానీ చిన్న సినిమా కోసం ఆ ఒక్క షోని కేటాయించాల్సిందేన‌ని జీవోలో పేర్కొన్నారు.

అయితే దీనికోసం ద‌ర్శ‌క‌ర‌త్న డా.దాస‌రి నారాయ‌ణ‌రావు కొంత పోరాడితే త‌న జీవితాంతం పోరాడుతూనే ఉన్నారు ఆర్.నారాయ‌ణ‌మూర్తి. చిన్న సినిమా బాగు ప‌డాలంటే క‌చ్ఛితంగా ఐదో ఆట కేటాయించాల‌ని డిమాండ్ చేసిన వ్య‌క్తి ఆర్. నారాయ‌ణ‌మూర్తి. దాస‌రి వెళ్లాక బ‌లంగా గొంతుక వినిపించింది మూర్తి గారే.

ఇంత‌కుముందు సీఎం జ‌గన్మోహ‌న్ రెడ్డితో స‌మావేశానికి నారాయ‌ణ మూర్తిని సినీపెద్ద‌లు ఆహ్వానించారు. జ‌గ‌న్ ప్ర‌భుత్వం సానుకూలంగా వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని కూడా ఆ స‌మావేశం అనంత‌రం ఆయ‌న అన్నారు. మొత్తానికి టికెట్ పై నేటి జీవోలో చిన్న సినిమాకి ఐదో షో ని కేటాయించ‌డం గ్రేట్ అనే చెప్పాలి. ఇవ్వాలి అనుకుంటే క్ష‌ణ‌మైనా ఆలోచించ‌ని జ‌గ‌న‌న్న మ‌న‌సున్న మారాజు! హ్యాట్సాఫ్ టు జ‌గ‌న‌న్నా!!