Begin typing your search above and press return to search.
చిరుని ఆకాశానికెత్తేసిన ఎర్రజెండా
By: Tupaki Desk | 19 March 2015 7:30 AM GMTఎర్రజెండ ఎర్రజెండ ఎన్నియలో అది ఎర్రెర్రని జెండా ఎన్నియలో.. ఈ పాట తలవగనే గుర్తుకొచ్చే ముఖం ఆర్.నారాయణమూర్తి. అతడు ఎర్రజెండాకు కట్టుబడి సినిమాలు తీసే గొప్ప విప్లవకారుడు. నిజమైన ప్రజల (పేదలు, బడుగు బలహీన వర్గాలు) కోసం సినిమాలు తీసే ఏకైక దర్శకనిర్మాత. అందుకే ఎందరు సూపర్‌స్టార్లు ఉన్నా ఆర్.నారాయణమూర్తి కూడా సూపర్‌స్టారే. అంతటి గొప్ప వ్యక్తిత్వం ఓ కమర్షియల్ హీరోని పొగిడేశాడంటే ఆసక్తికరంగా లేదూ? అవును అతడు మెగాస్టాఱ్ చిరంజీవిని ఆకాశానికెత్తేశాడు.
నువ్వు హీరోగా కమర్షియల్ సినిమా తీస్తానని పూరి అంతటివాడే ముందుకొస్తే ససేమిరా అన్న నారాయణమూర్తి తన వ్యక్తిత్వాన్ని నిలుపుకున్నాడు. నమ్ముకున్న సిద్ధాంతానికే కట్టుబడి సినిమాలు తీసే నారాయణమూర్తి చిరుని ఏమని పొగిడాడో తెలుసా? చిరంజీవి అనే కొమ్మ కింద హీరోలెందరో పుట్టుకొచ్చి విజయాలు సాధిస్తున్నారని కీర్తించాడు. చిరంజీవి పరిశ్రమకి వచ్చి 30ఏళ్లయినా.. ఆయన హవా ఇప్పటికీ తగ్గలేదు. ఆయన ఆశీస్సులతోనే పవన్‌కల్యాణ్ ఇంతటి స్థాయిలో ఉన్నాడు. చరణ్, అల్లు అర్జున్ ఇప్పటికే నిరూపించుకున్నారు. సాయిధరమ్, వరుణ్‌తేజ్ ఇప్పుడిప్పడే వస్తున్నారు.. ఈ క్రెడిట్ అంతా చిరంజీవిదే.. అంటూ పొగిడేశారు. గ్రేట్ నారాయణమూర్తి.