Begin typing your search above and press return to search.

విజయేంద్ర ప్రసాద్‌ ఇంటర్నేషనల్‌ రైటర్‌.. తథాస్తు

By:  Tupaki Desk   |   4 Jan 2019 11:13 AM GMT
విజయేంద్ర ప్రసాద్‌ ఇంటర్నేషనల్‌ రైటర్‌.. తథాస్తు
X
బాలీవుడ్‌ మూవీ ‘మణికర్ణిక’ను తెలుగులో కూడా విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. తాజాగా చిత్ర యూనిట్‌ సభ్యులు హైదరాబాద్‌ లో మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ మీడియా సమావేశంలో మణికర్ణిక తెలుగు ట్రైలర్‌ ను విడుదల చేయడం జరిగింది. మణికర్ణిక ప్రమోషన్‌ కార్యక్రమంలో ఈ చిత్ర రచయిత విజయేంద్ర ప్రసాద్‌, ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, ఆర్‌ నారాయణ మూర్తి ఇంకా పలువురు సినీ ప్రముఖులు మరియు చిత్ర యూనిట్‌ సభ్యులు పాల్గొన్నారు.

ఈ సందర్బంగా ఆర్‌ నారాయణ మూర్తి మాట్లాడిన మాటలు అందరి దృష్టిని ఆకర్షించాయి. తెలుగు సినిమా పరిశ్రమకు చెందిన వాడిగా నేను ఎంతగానో గర్విస్తున్నాను. బాలీవుడ్‌ ప్రతిష్టాత్మక చిత్రం మణికర్ణిక టైటిల్‌ కార్డ్స్‌ లో కథ, స్క్రీన్‌ ప్లే విజయేంద్ర ప్రసాద్‌, దర్శకత్వం క్రిష్‌ జాగర్లమూడి అంటూ చూసినప్పుడు పులకించి పోయాను. తెలుగు జాతికి అద్బుతమైన ఆణిముత్యం విజయేంద్ర ప్రసాద్‌. మన రచయిత జాతీయ రచయిత అంటూ నారాయణ మూర్తి ప్రశంసలు కురిపించాడు.

ఆ సమయంలోనే మీడియా పర్సన్స్‌ నుండి ఒక వ్యక్తి ఇంటర్నేషనల్‌ రైటర్‌ అంటూ కామెంట్‌ చేయడంతో నారాయణ మూర్తి వెంటనే స్పందిస్తూ పిల్లా భలే చెప్పావు, తథాస్తు అలాగే కావాలన్నాడు. ఇక కంగనాపై కూడా నారాయణమూర్తి తనదైన శైలిలో స్పందించి ఆమెపై ప్రశంసల వర్షం కురిపించాడు. ఇండస్ట్రీలోని అన్యాయాలను ఎదురిస్తూ వీర వనితగా నిలుస్తుందని, ఆమెకు నా అభినందనలు అన్నాడు. ఇలాంటి సినిమా చేసినందుకు కంగనాకు హ్యాట్సాఫ్‌. ఈ చిత్రం సంచలన విజయాన్ని సొంతం చేసుకోవాలంటూ శుభాకాంక్షలు తెలియజేశాడు.