Begin typing your search above and press return to search.

జగన్ పై ఎర్రన్న సంచలన కామెంట్స్

By:  Tupaki Desk   |   4 July 2019 6:28 AM GMT
జగన్ పై ఎర్రన్న సంచలన కామెంట్స్
X
ఆర్ నారాయణ మూర్తి.. ఈ విప్లవ హీరోను అందరూ ఇండస్ట్రీ ‘ఎర్రన్న’గా పిలుస్తుంటారు.. కమ్యూనిస్టు భావజాలం అధికంగా ఉన్న ఈయన సమాజంలోని అసృష్యతను - అణగారిన వర్గాల బాధలను తెరపై చూపించిన ప్రజా కథనాయకుడు. ఆయన తీసిన సినిమాలు అప్పట్లో బిగ్గెస్ట్ హిట్. ట్రెండ్ సెట్టర్. ముఖ్యంగా మావోయిస్టుల నేపథ్యంలో తీసిన చిత్రాలు ఇప్పటికీ ఎవర్ గ్రీనే. సమాజంలోని కుళ్లు - కుతంత్రాలను ఎలుగెత్తి చూపించడం ఆయనకు అలవాటు..

పెళ్లి కూడా చేసుకోకుండా సమాజహితం కోసం సినిమాలే లోకంగా ఇప్పటికీ బతుకుతున్నాడు ఆర్. నారాయణమూర్తి. తాజాగా ‘మార్కెట్లో ప్రజాస్వామ్యం’ పేరుతో ఆ సినిమా రూపొందిస్తున్నారు. అందులోని ప్రధాన కథాంశం రాజకీయ ఫిరాయింపులేనట.. దీనిపై ఆయన తన మనోభావాలను తాజాగా వెల్లడించారు.

కేంద్రంలోని బీజేపీ పార్టీ టీడీపీ ఎంపీలనే లాక్కొని ఫిరాయింపు రాజకీయాలు చేస్తోందరి ఆర్. నారాయణ మూర్తి విమర్శించారు. ఎమ్మెల్యేల ఫిరాయింపులు ప్రజాస్వామ్యంలో మంచిది కాదని.. అందుకే తాను దీన్ని బేస్ చేసుకొని ‘మార్కెట్లో ప్రజాస్వామ్యం’ తీశానని చెప్పుకొచ్చాడు.

ఇక తెలుగు రాష్ట్రాల్లో ఈ ఫిరాయింపు రాజకీయాలను చేయనని అసెంబ్లీలో ప్రకటించిన జగన్ కు హ్యాట్సాప్ చెప్పారు ఆర్.నారాయణ మూర్తి. ఇదో మంచి పరిణామం అని .. దీన్ని అందరూ రాజకీయాల్లో పాటిస్తే అస్సలు ఫిరాయింపులే ఉండవని పేర్కొన్నారు.