Begin typing your search above and press return to search.
మూర్తిగారికి ఈగో అడ్డొచ్చిందటలే!!
By: Tupaki Desk | 6 Jan 2017 1:59 PM GMT''టెంపర్'' సినిమాలో పోసాని కృష్ణమురళి చేసిన మూర్తి అనే కానిస్టేబుల్ రోల్ బాగా పాపులర్ అయ్యింది. ముఖ్యంగా మనోడు సినిమా ఆకరిలో ఇన్సపెక్టర్ దయ (ఎన్టీఆర్)కు సెల్యూట్ కొట్టే సీన్ తో రోమాలు నిక్కపొడుచుకున్నాయ్. అందుకే ఈ పాత్రను తనకిస్తే ఇంకా దంచేసేవాడినని స్వయంగా విలన్ వేషాలకు షిఫ్ట్ అయిపోయిన జగపతి బాబు కూడా కామెంట్ చేశాడు. అయితే ఈ పాత్రను ప్రముఖ నటుడు ఆర్.నారాయణ మూర్తి కోసం రాసుకున్నానని దర్శకుడు పూరి జగన్ రివీల్ చేసిన సంగతి తెలిసిందే. అందుకే పాత్ర పేరు మూర్తి గారూ అంటూ అలాగే ఉంచేశాడు.
ఇప్పుడు ''కానిస్టేబుల్ వెంకట్రావ్'' అనే సినిమాతో వస్తున్న ఆర్.నారాయణమూర్తి.. అసలు టెంపర్ సినిమాలో మూర్తి పాత్రను ఎందుకు తిరస్కరించాడో చెప్పుకొచ్చాడు. ''నేను కెరియర్లో ఎంతో కష్టపడి హీరో స్థాయికి వచ్చా. ముందులో జూనియర్ ఆర్టిస్టుగా.. తరువాత సపోర్టింగ్ రోల్స్ చేస్తూ.. ఇలా చాలా వేషాలే వేశాను. ఇప్పుడు హీరో అయ్యాక తిరిగి వెళ్ళి అలాంటి పాత్రను పోషించలేను'' అని చెప్పాడు. చూస్తుంటే రెబెల్ మూర్తిగారికి ఈగో పాళ్ళు బాగా ఎక్కువే అని చెప్పాలేమో.
డైరక్టుగా కెరియర్ హీరోగా స్టార్ట్ చేసిన సూపర్ స్టార్ కృష్ణ వంటివారే సపోర్టింగ్ రోల్స్ చేస్తున్నారు. వయసుపైబడింది కాబట్టి సరదాగా అలాంటి రోల్స్ వేయడంలో తప్పేంలేదు. అలాగే సైడ్ క్యారక్టర్లు వేసుకుంటూ వచ్చి మెయిన్ లీడ్ అయిపోయి దేశానికే మెగాస్టార్ అయిపోయిన అమితాబ్ బచ్చన్ కూడా ఇప్పుడు సపోర్టింగ్ రోల్స్ చేస్తున్నారు. మూర్తి గారూ.. ఈగో పక్కనెట్టి సినిమాల్లో మీ టాలెంట్ చూపించండి సార్.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/