Begin typing your search above and press return to search.
పవన్ కళ్యాణ్ సీఎం కావాలంటున్న ఎర్రన్న
By: Tupaki Desk | 18 March 2015 9:01 AM GMTతననెంతగానో అభిమానించే పూరి జగన్నాథ్ 'టెంపర్'లో కీలకమైన పాత్ర ఉంది చేయమని ఎంత వేడుకున్నా ఒప్పుకోని నారాయణ మూర్తి.. వైవీఎస్ చౌదరి రేయ్ సినిమా కోసం రూపొందించిన పవనిజం పాటను లాంచ్ చేయడానికి వస్తున్నాడంటే చాలామందికి నమ్మశక్యం కాలేదు. ఐతే నారాయణ మూర్తి నిజంగానే ఈ వేడుకకు ముఖ్య అతిథిగా వచ్చి.. పవనిజం పాటను లాంచ్ చేశాడు. దీన్ని బట్టి పవన్ మీద నారాయణమూర్తికి ఎంత మంచి అభిప్రాయముందో అందరికీ అర్థమైంది. ఈ సందర్భంగా పవన్ మీద తన అభిమానాన్ని మూర్తి ఏమాత్రం దాచుకోలేదు. పవన్ సీఎం కావాలని సభాముఖంగా ఆకాంక్షించాడు.
''వాళ్లు ముఖ్యమంత్రి అవుతారు, వీళ్లు ముఖ్యమంత్రి అవుతారు అని చెప్పడం కాదు. మీరెప్పుడు ముఖ్యమంత్రి అవుతారో చెప్పండి'' అంటూ పవన్‌ను సూటిగా అడిగేశాడు నారాయణమూర్తి. ''చిరంజీవి నలభై ఏళ్ల కంచుకోటను బద్దలుకొట్టి మెగాస్టార్ అయ్యారు. ఆయన నీడలో పవన్ కల్యాణ్ పవన్ స్టార్‌గా ఎదిగారు. పవన్ కల్యాణ్ మానవత్వం ఉన్న వ్యక్తి. ఆయన ప్రజల సమస్యల కోసం రాజకీయాల్లోకి వచ్చినప్పుడు, పార్టీ పెట్టినప్పుడు.. కచ్చితంగా ముఖ్యమంత్రి అవ్వాలి. నాకూ ముఖ్యమంత్రి అవ్వాలని ఉంది. కానీ నేను పార్టీ పెట్టలేదు కదా..? పవన్ పార్టీ పెట్టారు. అందుకే ఆయన సీఎం అవ్వాలి. రొనాల్డ్ రీగన్, ఎన్టీఆర్, ఎమ్జీఆర్‌లా రాజకీయాల్లో పేరు తెచ్చుకోవాలి'' అని ఆకాంక్షించారు నారాయణ మూర్తి. మరి ఆయన కోరికను పవన్ నెరవేరుస్తారా?