Begin typing your search above and press return to search.
'ఆర్ ఆర్ ఆర్' ట్రైలర్ క్రెడిట్ అతనికే దక్కుతుంది: రాజమౌళి
By: Tupaki Desk | 12 Dec 2021 3:30 PM GMTరాజమౌళి దర్శకత్వంలో రూపొందిన 'ఆర్ ఆర్ ఆర్' ప్రేక్షకుల ముందుకు రావడానికి ముస్తాబవుతోంది. జనవరి 7వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను వివిధ భాషల్లో విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సినిమా ప్రమోషన్స్ కి సంబంధించిన పనుల్లో టీమ్ అంతా కూడా ఫుల్ బిజీగా ఉంది. వెంటవెంటనే కొత్త పోస్టర్లు .. సింగిల్స్ వదులుతూ వస్తున్నారు. అలా రీసెంట్ గా ఈ సినిమా నుంచి ఒక ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ప్రధాన పాత్రలను కవర్ చేస్తూ కట్ చేసిన ఈ ట్రైలర్ ఒక రేంజ్ లో దూసుకుపోతోంది.
ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజు పాత్రలో చరణ్ .. కొమరం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ కనిపించనున్నారు. ఈ రెండు పాత్రలు కూడా పోరాటపటిమ కలిగిన పాత్రలే. పౌరుష పరాక్రమాలు కలిగిన పాత్రలే. అలాంటి ఇద్దరి పాత్రలతో కూడిన ఒక ట్రైలర్ ను రిలీజ్ చేస్తున్నప్పుడు ఇమేజ్ పరంగా బ్యాలెన్స్ చేయడం చాలా కష్టమైన విషయం. అభిమానుల వైపు నుంచి ఎలాంటి కామెంట్స్ రాకుండా ఈ ట్రైలర్ దూసుకుపోతోంది. రెండు పాత్రలకి సంబంధించిన హీరోయిజంపై కట్ చేసిన ఈ ట్రైలర్ ఎంతగానో ఆకట్టుకుంటోంది. రికార్డు స్థాయిలో వ్యూస్ ను .. లైక్స్ ను సొంతం చేసుకుంటోంది.
తాజాగా ఈ ట్రైలర్ గురించి రాజమౌళి తన ట్విట్టర్ ద్వారా స్పందించారు. ఈ ట్రైలర్ ఇంత ఫాస్టుగా .. ఈ స్థాయిలో కనెక్ట్ కావడానికి వెనుక ఒక వ్యక్తి ఉన్నాడు. ముందుగా ఆయనకి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఆ వ్యక్తి ఎవరో కాదు కోలీవుడ్ ఎడిటర్ ప్రవీణ్ ఆంథోని .. ఈ ట్రైలర్ ను ఆయనే కట్ చేశాడు. ఈ ట్రైలర్ విషయంలో ఆయన పెట్టిన ఎఫర్ట్ కీ .. కేటాయించిన సమయానికి .. ఆయన పేషన్స్ కి థ్యాంక్స్ చెబుతున్నాను. ఈ ట్రైలర్ క్రెడిట్ ఆయనకే చెందుతుంది" అంటూ తన మనసులోని మాట చెప్పారు.
డీవీవీ దానయ్య భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమాకి కీరవాణి సంగీతాన్ని సమకూర్చారు. ఇప్పటికి బయటికి వచ్చిన పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. అజయ్ దేవగణ్ .. అలియా భట్ వంటి బాలీవుడ్ ఆర్టిస్టులతో పాటు హాలీవుడ్ ఆర్టిస్టులు కూడా ఈ సినిమాలో నటించారు. అజయ్ దేవగణ్ .. అలియా ఇద్దరికీ కూడా తెలుగులో ఇదే తొలి సినిమా కావడం విశేషం. ఒక కీలకమైన పాత్రను సముద్రఖని పోషించగా, మరో ముఖ్యమైన పాత్రలో శ్రియ కనిపించనుంది.ఈ సినిమా విడుదల తేదీ కోసం ఇటు నందమూరి అభిమానులు .. అటు మెగా ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.