Begin typing your search above and press return to search.
యూట్యూబ్ లో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న 'రా రా రెడ్డి' మాస్ సాంగ్..!
By: Tupaki Desk | 12 July 2022 3:58 PM GMTయూత్ స్టార్ నితిన్ హీరోగా నటిస్తున్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ''మాచర్ల నియోజకవర్గం''. ఇందులో కృతి శెట్టి మరియు కేథరిన్ థ్రెసా వంటి ఇద్దరు గ్లామరస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. మరింత గ్లామర్ ను జోడిస్తూ మేకర్స్ మరో కథానాయిక అంజలి ని స్పెషల్ సాంగ్ లోకి తీసుకొచ్చారు.
'రారా రెడ్డి.. ఐ యామ్ రెడీ' అనే స్పెషల్ సాంగ్ ను ఇటీవలే విడుదలైంది. ఈ పాటలో నితిన్ సరసన అంజలి కాలు కదిపింది. మెలోడీ స్పెషలిస్ట్ మహతి స్వర సాగర్ తన మాస్ కంపోజిషన్ తో ఆకట్టుకోగా.. గాయని లిప్సిక తన వాయిస్ తో మరింత ప్రత్యేకంగా మార్చింది.
ఇందులో 'రాను రాను అంటూనే చిన్నదో' అంటూ 'జయం' సాంగ్ బిట్ ని చేర్చడం విశేషం. నితిన్ మరియు అంజలిల మధ్య కెమిస్ట్రీ.. ఇద్దరు వేసిన మాస్ డ్యాన్స్ ఈ పాటని మరో స్థాయికి తీసుకెళ్లాయని చెప్పాలి.
విడుదలైన కొన్ని గంటల్లోనే 'రా రా రెడ్డి' పాట అన్ని సోషల్ మీడియా మరియు అన్ని మ్యూజిక్ ప్లాట్ ఫారమ్ లలో ట్రెండింగ్ లో నిలిచింది. ఇది ఇప్పటివరకు 11 మిలియన్లకు పైగా వ్యూస్ తో యూట్యూబ్ ట్రెండ్స్ లో అగ్రస్థానంలో ఉండటం విశేషం.
'మాచర్ల నియోజకవర్గం' నుంచి ఇంతకుముందు ఫస్ట్ లుక్ - ఇతర పోస్టర్లతో పాటు పెప్పీ ట్రాక్ మరియు టీజర్ ను చిత్ర బృందం విడుదల చేసింది. ఈ ప్రమోషనల్ కంటెంట్ కు అన్ని వర్గాల నుంచి మంచి స్పందన లభించింది. రాబోయే రోజుల్లో మరిన్ని అప్డేట్లు ఇవ్వడానికి మేకర్స్ రెడీ అవుతున్నారు.
రాజ్ కుమార్ ఆకెళ్ల సమర్పిస్తున్న ''మాచర్ల నియోజకవర్గం'' సినిమాతో ఎడిటర్ ఎం రాజశేఖర్ రెడ్డి దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. ఆదిత్య మూవీస్ ఎంటర్టైన్మెంట్స్ తో కలిసి శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ పై నితిన్ తండ్రి ఎన్.సుధాకర్ రెడ్డి మరియు సోదరి నికితారెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ప్రసాద్ మూరెళ్ల సినిమాటోగ్రఫీ అందించిన ఈ సినిమాకి సాహి సురేష్ ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేశారు. మామిడాల తిరుపతి డైలాగ్స్ రాయగా.. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు. 'మాచర్ల నియోజకవర్గం' సినిమాని ఆగస్టు 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నారు.