Begin typing your search above and press return to search.

స‌మీరా రెడ్డి కంటే మ‌మ్మీ గారే పోష్ ఎన‌ర్జిటిక్!

By:  Tupaki Desk   |   11 Aug 2022 3:37 PM GMT
స‌మీరా రెడ్డి కంటే మ‌మ్మీ గారే పోష్ ఎన‌ర్జిటిక్!
X
నితిన్ క‌థానాయ‌కుడిగా న‌టించిన `మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం` ఈ శుక్ర‌వారం (12 ఆగ‌స్ట్) అభిమానుల ముందుకు రానున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రానికి మ‌హ‌తి స్వ‌ర‌సాగ‌ర్ అందించిన సంగీతం యూత్ కి ఇప్ప‌టికే క‌నెక్ట‌యింది. పాట‌ల‌కు చ‌క్క‌ని ఆద‌ర‌ణ ద‌క్కుతోంది. ఇందులో రారా రెడ్డి సాంగ్ ఇప్ప‌టికే వెబ్ మాధ్య‌మాల్లో దుమ్ము రేపుతున్న సంగ‌తి తెలిసిందే.

ముఖ్యంగా ఈ ట్యూన్ లో `రాను రానంటూనే చిన్న‌దో` టిట్ బిట్ కి సెల‌బ్రిటీలు సామాన్యులు అనే తేడా లేకుండా డ్యాన్సులు చేసేందుకు వెన‌కాడ‌డం లేదు. తాజాగా న‌టి స‌మీరారెడ్డి త‌న త‌ల్లి గారితో క‌లిసి డ్యాన్సులు చేసిన వీడియో వైర‌ల్ గా మారింది.

60 ప్ల‌స్ ఏజ్ లో స‌మీరా రెడ్డి త‌ల్లి గారు ఎంతో ఎన‌ర్జిటిక్ గా హుక్ స్టెప్ వేస్తూ ఆశ్చ‌ర్య‌ప‌రిచారు. నిజానికి ప‌రిశీల‌న‌గా గ‌మ‌నిస్తే స‌మీరా రెడ్డి కంటే ఆమె త‌ల్లిగారి హైఎన‌ర్జీతో పాటు పోష్ లుక్ తో హైలైట్ గా నిలిచార‌ని చెప్పాలి. ప్ర‌స్తుతం ఈ వీడియో అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారింది. ఇదే పాట‌కు స‌మీరా రెడ్డి కంటే ముందే క్రికెట‌ర్ చాహ‌ల్ భార్యామ‌ణి కూడా హుక్ స్టెప్ వేసి అల‌రించిన సంగ‌తి తెలిసిందే.

స‌మీరా రెడ్డి ఇటీవ‌లే ఓ బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చిన సంగ‌తి తెలిసిందే. మ‌మ్మీ గా మారాక రూపాన్ని మెయింటెయిన్ చేసేందుకు అంత ఆస‌క్తిగా ఉన్న‌ట్టు క‌నిపించ‌లేదు. అలాగే న‌ట‌న‌కు కూడా దూరంగా ఉంది.

తాజాఆ స‌మీరా షేర్ చేసిన వీడియో చూడ‌గానే.. మూస పద్ధతులకు టాటా చెప్పి బాడీ పాజిటివిటీపై సందేశాన్ని ఇస్తున్న సమీరా రెడ్డికి సెల్యూట్ కొడుతోంది యూత్.

ఇన్ స్టాలో స‌మీరా స్వీయ-ప్రేమపై చ‌క్క‌ని నోట్ ని రాసారు.``నేను నా శరీరాన్ని ప్రేమిస్తున్నాను.. నా శరీరంపై ద‌యాగుణం క‌లిగి ఉన్నాను``అని రాసింది. ఇలాంటి ఒక రూపాన్ని అంగీకరించేందుకు చేసిన పోరాటాన్ని వివరిస్తూ-``ప్రపంచం నా గురించి ఏమనుకుంటుందో అనే ఆందోళనతో నేను సంవత్సరాలు వృధా చేశాను`` అని పేర్కొంది. అయితే ఇప్పుడు సమీర మ‌రో కొత్త విష‌యం కూడా చెప్పింది. నేను నా అందాల‌ను కెమెరా ముందు ప్ర‌ద‌ర్శించే క్ర‌మంలో నేను ఎప్పుడూ ఆనందంగా సుఖంగా లేను! అని తెలిపింది.

స‌మీరా రెడ్డి.. స్వీయ ప్రేమ.. బాడీ పాజిటివిటీపై తన సందేశాలతో అభిమానులను ప్రేరేపించడం ఇదే తొలిసారి కాదు. ఇటీవల 43 ఏళ్ల స‌మీరా రెడ్డి గత మూడు సంవత్సరాలలో కాలంతో `వెళ్ల‌డం` అనే తత్వాన్ని విశ్వసించడం ద్వారా ఒక వ్యక్తిగా ఎలా అభివృద్ధి చెందిందో వెల్లడించింది.

``నేనైనా మీరైనా కానీ #అసంపూర్ణం!`` మూడు సంవత్సరాల క్రితం నేను విశ్వాన్ని పూర్తిగా విడిచిపెట్టాను.. నెమ్మదిగా.. కానీ ఖచ్చితంగా స్పష్టంగా ఉన్నాను. మనకు మనం `నిజం` గా మారేందుకు ఒక్కటే మార్గం. వయస్సు- బరువు- డబ్బు- సంబంధాలు- స్వీయ-విలువ- విజయం అన్నిటినీ ఎలా ఎంచుకోవాలో తెలియాలి`` అని రాసింది.