Begin typing your search above and press return to search.
ఆ మాటే చలపతిరావు దూరమయ్యేలా చేసిందా?
By: Tupaki Desk | 25 Dec 2022 4:24 PM GMTపొరపాటున అన్న మాట మన క్యారెక్టర్ ని దెబ్బతీస్తూ వుంటుంది. అందిరి ముందుకు రావడానికి ఇబ్బందికరంగా మారుతుంది. అన్నది దివంగత క్యారెక్టర్ ఆర్టిస్ట్ చలపతిరావు విషయంలో అక్షరాలా నిజమైంది. స్వర్గీయ తారక రామారావు నుంచి నేటి తరం నటుల వరకు ఇలా అన్ని తరాల నటులతో కలిసి పని చేశారాయన. 1500 లకు పైగా సినిమాల్లో నటించిన నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు. కెరీర్ ప్రారంభం నుంచి విలన్ పాత్రలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన చలపతి రావు గుండే పోటు కారణంగా మృతి చెందిన విషయం తెలిసిందే.
ఆయన మరణంతో టాలీవుడ్ లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇటీవల రెబల్ స్టార్ కృష్ణంరాజు, సూపర్ స్టార్ కృష్ణ, కైకాల సత్యనారాయణ మృతి చెందిన విషాద సంఘటనలని మర్చిపోకముందే టాలీవుడ్ కు చలపతిరావు రూపంలో మరో షాక్ తగిలింది.
గత కొంత కాలంగా తక్కువ సినిమాల్లో నటిస్తూ పబ్లిక్ ఫంక్షన్ లలో కనిపించని చలపతిరావు అకస్మాత్తుగా గుండెపోటుతో మృతి చెందడంతో టాలీవుడ్ వర్గాలు ఒక్కసారిగా షాక్ కు గురయ్యాయి.
గతంలో తను నటించిన ప్రతీ సినిమా ఫంక్షన్ లో హుషారుగా కనిపిస్తూ వచ్చిన చలపతిరావు గత కొంత కాలంగా సినిమా ఫంక్షన్ లకు దూరంగా వుంటూ వస్తున్నారు. నాగచైతన్య, రకుల్ ప్రీత్ సింగ్ కలిసి నటించిన 'రారాండోయ్ వేడుక చూద్దాం' ఈవెంట్ లో జరిగిన ఓ వివాదం కారణంగా చలపతిరావు సినిమా ఫంక్షన్ లకు దూరమయ్యారు.
యాంకర్ రవి 'అమ్మాయిలు హానికరమా' అంటూ అడిగిన ప్రశ్నకు 'అమ్మాయిలు హానికరం కాదు కానీ.. పక్కలోకి పనికొస్తారు' అంటూ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే సృష్టించాయి.
సోషల్ మీడియా వేదికగా చలపతిరావుపై భారీ స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. వయసుతో సంబందం లేకుండా ఆయనపై దారుణంగా విమర్శలు గుప్పించారు. దీంతో మనస్థాపానికి గురైన చలపతిరావు తను కావాలని అలా అనలేదని, పొరపాటున యాంకర్ అన్నమాటలకు అలా అనాల్సి వచ్చిందంటూ చలపతిరావు వివరణ ఇవ్వాల్సి వచ్చింది. ఆ సంఘటన కారణంగా మనస్థాపానికి గురైన ఆయన అప్పటి నుంచి సినిమా ఫంక్షన్ లకు దూరంగా వుంటూ వచ్చారు. మీడియా ముందుకు రావడానికే ఇష్టపడలేదు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.