Begin typing your search above and press return to search.
రజినీ విశ్వరూపాన్ని చూపించిన 'రా సామీ' సాంగ్..!
By: Tupaki Desk | 29 Oct 2021 4:00 AM GMTసూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా తమిళ దర్శకుడు శివ రూపొందించిన తాజా చిత్రం 'అన్నాత్తే'. తెలుగులో ''పెద్దన్న" అనే టైటిల్ తో విడుదల కానుంది. దీపావళి కానుకగా నవంబరు 4న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తెలుగులో ఏషియన్ సినిమాస్ నారాయణదాస్ కె. నారంగ్ మరియు సురేష్ బాబు కలిసి ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఫస్ట్ లుక్ - టీజర్ - ట్రైలర్ అంటూ రెగ్యులర్ గా అప్డేట్స్ ఇస్తూ సినిమాపై అంచనాలు రెట్టింపు చేశారు. ఈ క్రమంలో తాజాగా ‘రా సామీ’ అనే పవర్ ఫుల్ సాంగ్ లిరికల్ వీడియోను చిత్ర బృందం విడుదల చేసింది.
'జుట్టే దొరకబట్టు.. పట్టా దులిపి కొట్టు.. చెట్టు మీద దెయ్యాలన్నీ కాలి కూలి పోవాలా..' అంటూ సాగిన ఈ పాటకు కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించారు. డబ్బింగ్ సాంగ్ కాబట్టి దానికి తగినట్లుగా లిరిక్స్ రాసినట్లు తెలుస్తోంది. ఈ గీతానికి డి. ఇమ్మాన్ స్వరాలు సమకూర్చారు. సింగర్ ముఖేష్ ఎంతో హుషారుగా ఆలపించారు. ఈ పాట సినిమాలో రజినీ కాంత్ పాత్రను ఎలివేట్ చేసేలా.. పవర్ ఫుల్ యాక్షన్ సీన్స్ తో అలరిస్తోంది. ఇందులో రజనీ పంచె కట్టులో ఇంటెన్స్ అండ్ మాస్ లుక్ లో ఆకట్టుకున్నారు.
'పెద్దన్న' చిత్రాన్ని కళానిధి మారన్ సమర్పణలో సన్ పిక్చర్స్ సంస్థ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. ఇందులో రజనీకాంత్ పంచాయతీ పెద్ద వీరన్నగా నటించారు. ఆయనకు జోడీగా నయనతార.. సోదరిగా కీర్తి సురేశ్ కనిపించనున్నారు. ఖుష్బూ - మీనా - జగపతి బాబు - ప్రకాశ్ రాజ్ - సూరి - అభిమన్యు సింగ్ కీలక పాత్రలు పోషించారు. వెట్రి పలనిస్వామి ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందించగా.. రూబెన్ ఎడిటింగ్ వర్క్ చేశారు. దిలీప్ సుబ్బరాయన్ ఫైట్స్ కంపోజ్ చేశారు. యాక్షన్ - కామెడీతో పాటుగా భావోద్వేగాలు కలబోసిన ఈ సినిమా ఎలాంటి విజయం సాదిస్తుందో చూడాలి.