Begin typing your search above and press return to search.
మగధీర ఫ్రీ మేకర్స్ చెప్పే కబుర్లు వింటిరా!!
By: Tupaki Desk | 1 May 2017 10:40 AM GMTబాలీవుడ్ లో రాబ్తా టైటిల్ పై రూపొందుతున్న మూవీపై చాలానే రూమర్స్ ఉన్నాయి. రామ్ చరణ్-రాజమౌళి బ్లాక్ బస్టర్ మూవీ మగధీరకు ఇది ఫ్రీమేక్ అనే టాక్ ముందు నుంచి వినిపిస్తూనే ఉంది. ట్రైలర్ చూశాక ఈ విషయాన్ని జనాలు ఫిక్స్ అయిపోయారు కూడా.
రెండు జన్మల వృత్తాంతంపై తెరకెక్కిన రాబ్తా స్టోరీపై ఇప్పుడు రైటర్స్ సిద్ధార్ధ్ సింగ్.. గరిమా వహల్ రియాక్ట్ అయ్యారు. బిమల్ రాయ్ మధుమతి నుంచి షారూక్ ఖాన్ ఓంశాంతి ఓం వరకూ.. రెండు జన్మలు.. పునర్జన్మల కథలపై చాలానే సినిమాలు వచ్చాయని అంటున్నారు. అంతే కాదు.. ఈ ప్రపంచంలో స్థూలంగా ఏడు కథలు మాత్రమే ఉంటాయని.. ఎన్ని రకాలు రాసినా వాటినే మళ్లీ అటూ ఇటూ చేసినట్లుగా ఉంటుందంటూ మెట్ట వేదాంతం కూడా చెప్పేస్తున్నారు. మగధీరకు కాపీ అనే మాట వినిపిస్తోందని తెలుసంటున్న ఈ రైటర్స్.. తాము కాపీ కొట్టలేదని అంటున్నారు.
ఇద్దరు వ్యక్తులు తాము పూర్వజన్మలో రోమియో-జూలియట్.. లైలా-మజ్ను స్థాయి ప్రేమికులం అని తెలిస్తే ఏం చేస్తారన్నదే రాబ్తా మూవీ కథ అని చెప్పారు రైటర్స్. ఈ మూవీలో నీటికి చాలా ప్రాధాన్యత ఉంటుందని.. ప్రకృతి వనరులు ఎప్పటికీ మారవనే కాన్సెప్ట్ సినిమాలో కీలకంగా ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/