Begin typing your search above and press return to search.
కాపీ కాదు.. క్రియేటివిటీ అట
By: Tupaki Desk | 26 May 2017 9:34 AM GMTవేరే భాషల్లో హిట్టయిన సినిమాల తాలూకు కథను.. సీన్లను ఎత్తుకొచ్చేసి ఏవో కొన్ని సీన్లు అటూ మార్చి కొత్త కథ అన్నట్టుగా బిల్డప్ ఇవ్వడం కొంతమంది సినిమా వాళ్లు చేసేపనే. కానీ ఒరిజినల్ సినిమా వాళ్లు ఈ విషయం గుర్తించి వేలెత్తి చూపిస్తే మాత్రం అబ్బే అదేం లేదు. కొన్ని పోలికలుంటే ఉండొచ్చు కానీ మా క్రియేటివిటీ వేరంటూ ఓ డైలాగు వినిపిస్తారు. ప్రస్తుతం హిందీలో రిలీజవుతున్న రాబ్తా సినిమా టీం కూడా అచ్చు ఇదే మాట చెబుతోంది. సుశాంత్ సింగ్ రాజ్ పుత్, కృతి సనన్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా రిలీజ్ కు సిద్ధమైంది.
‘రాబ్తా’ సినిమా మగధీర సినిమాకు కాపీ అంటూ నిర్మాత అల్లు అరవింద్ కోర్టును ఆశ్రయించారు. రెండున్నర నిమిషాల ట్రైలర్ చూసి మీరెలా కాపీ అని డిసైడ్ చేస్తారంటూ రాబ్తా టీం దీనిపై కౌంటర్ ఎటాక్ ఇస్తోంది. హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కూడా ఈ కేసు నిలబడేది కాదని కొట్టిపారేస్తున్నాడు. కొన్ని సినిమాల్లో సీన్లు ఇతర సినిమాలకు ఇన్ స్పిరేషన్ కావచ్చని.. అంతమాత్రాన అవన్నీ కాపీ అని ఎలా అంటారని.. వాటిని క్రియేటివిటీ కింద చూడాలని ఈ సినిమా టీం అంటోంది. పైగా తమ క్రియేటివిటీని అవమానించారంటూ ఓ ప్రెస్ నోట్ కూడా ఇచ్చారు.
రాబ్తా ట్రైలర్ లోనే దాదాపు కథ మొత్తం రివీల్ చేశారు. మగధీర సినిమా చూసిన వారెవరికైనా రాబ్తా ట్రైలర్ చూస్తుంటే మగధీర సినిమా అంతా కళ్లముందే మెదులుతుంది. ముఖ్యంగా గత జన్మ స్టోరీ అయితే దాదాపుగా దింపేసినట్లు తెలిసిపోతోంది.దాంతోనే అల్లు అరవింద్ కోర్ట్ మెట్లెక్కి రాబ్తాం టీంకు నోటీసులిచ్చారు. దీంతో రాబ్తా టీం క్రియేటవిటీ అనే మాటెత్తుకుంది. మక్కీకి మక్కీ దింపేయడమూ ఓ క్రియేటవిటీయే అంటుంటే మనమే అర్ధం చేసుకోవాలేమో!!
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/