Begin typing your search above and press return to search.
‘రాచ్చస మావయా’ అంటూ కార్తీతో పోటీకి సై అంటున్న శోభిత..!
By: Tupaki Desk | 13 Sep 2022 5:47 PM GMTలెజెండరీ దర్శకుడు మణిరత్నం అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన పీరియాడికల్ మూవీ ''పొన్నియన్ సెల్వన్''. చోళుల కాలం నాటి కథాంశంతో రెండు భాగాలుగా ఈ చిత్రాన్ని రూపొందించారు. ఫస్ట్ పార్ట్ ని ''PS 1'' పేరుతో రిలీజ్ కు రెడీ చేశారు. ఈ నేపథ్యంలో జోరుగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
'పొన్నియన్ సెల్వన్' చిత్రంలో విక్రమ్ - కార్తీ - జయం రవి - విక్రమ్ ప్రభు - ఐశ్వర్య రాయ్ బచ్చన్ - త్రిష కృష్ణన్ - శోభితా ధూళిపాళ్ల - ఐశ్వర్య లక్ష్మి తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై ఆసక్తిని కలిగించింది. తాజాగా ‘రాచ్చస మావయా’ అనే సాంగ్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.
''మత్తెక్కిటు వస్తున్నావా.. పెద్దత్తకు భర్త.. నిన్నొత్తి గిల్లి బుద్ది కొంచెం ఇస్తా'' అంటూ సాగిన ఈ పాట అలరిస్తోంది. 'రాచ్చస మావయా.. రాత్రి వేళ సూర్యుడా.. నీ చచ్చు బుద్ధి మారదా' అంటూ శ్రీకృష్ణుడి గెటప్ లో శోభితా ధూళిపాళ్ల ఆడి పాడుతుండగా.. రాక్షసుడు గెటప్ లో కార్తీ ఎంట్రీ ఇస్తాడు. ఈ పాటలో త్రిష చాలా అందంగా కనిపించింది.
శోభిత తన మామయ్యను ఆటపట్టించే సందర్భంలో చిత్రీకరించబడిన ఈ సాంగ్ లో కార్తీ హావభావాలు - డ్యాన్స్ ఆకట్టుకుంటున్నాయి. దీనికి బృంద మాస్టర్ కొరియోగ్రఫీ చేసారని తెలుస్తోంది. ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎ.ఆర్.రెహమాన్ 'రాచ్చస మావయ' పాటకు స్వరాలు సమకూర్చారు.
గేయ రచయిత అనంత్ శ్రీరామ్ కాస్త కఠినమైన పదాలతో పాట రాయగా.. ప్రముఖ గాయనీ గాయకులు శ్రేయా ఘోషల్ - శంకర్ మహదేవన్ - మహేష్ వినాయక్ రామ్ లు కలిసి అద్భుతంగా ఆలపించారు. సాంగ్ విజువల్స్ మరియు ఆర్ట్ వర్క్ కూడా బాగున్నాయి.
కాగా, 'PS 1' అనేది మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్. ప్రసిద్ధ రచయిత కల్కి కృష్ణమూర్తి రాసిన ‘పొన్నియిన్ సెల్వన్’ నవల ఆధారంగా ఈ సినిమాని రూపొందించారు. ఈ సినిమాలో ప్రభు - విక్రమ్ ప్రభు - శరత్ కుమార్ - జయరామ్ - ప్రకాష్ రాజ్ - రెహమాన్ - రాధాకృష్ణన్ పార్థీవన్ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు.
లైకా ప్రొడక్షన్స్ మరియు మణిరత్నం మద్రాస్ టాకీస్ బ్యానర్స్ పై సుభాస్కరన్ - మణిరత్నం సంయుక్తంగా భారీ బడ్జెట్ తో ‘పొన్నియిన్ సెల్వన్’ చిత్రాన్ని నిర్మించారు. రవి వర్మన్ సినిమాటోగ్రఫీ అందించగా.. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ వర్క్ చేశారు. తోట తరణి ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరించారు.
'పీఎస్ 1' సినిమాని పాన్ ఇండియా స్థాయిలో సెప్టెంబర్ 30వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. తెలుగు తమిళ మలయాళ కన్నడ హిందీ భాషల్లో ఈ సినిమా విడుదల కాబోతోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.