Begin typing your search above and press return to search.

ట్రైల‌ర్ టాక్: 24 గంట‌ల్లో హ‌త్య వెన‌క‌

By:  Tupaki Desk   |   5 Nov 2019 2:49 PM GMT
ట్రైల‌ర్ టాక్: 24 గంట‌ల్లో హ‌త్య వెన‌క‌
X
క్రైమ్ స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ల‌ ట్రెండ్ న‌డుస్తోంది. ఇటీవ‌ల ప‌లు చిత్రాలు ఈ త‌ర‌హాలో వ‌చ్చిన‌వి విజ‌యం అందుకున్నాయి. తాజాగా ఇదే త‌ర‌హాలో మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ జోన‌ర్ తో టాలీవుడ్ లో మ‌రో ప్ర‌య‌త్నం `రాగ‌ల 24 గంట‌ల్లో`.

వార్తల్లో వాతావరణం గురించి చెప్పిన‌ట్టే.. రాగల 24 గంటల్లో ఏం జ‌రుగుతుందో ఈ సినిమాలో చూపిస్తార‌ట‌. కొన్ని ఊహించని సంఘటనలతో ఈ సినిమాను సస్పెన్స్ థ్రిల్లర్ ఇది. ఇంత‌కుముందు టీజ‌ర్ ఆక‌ట్టుకుంది. ఇప్పుడు ట్రైల‌ర్ అంతే గ్రిప్పింగ్ గా మైమ‌రిపిస్తోంది. ఒక హ‌త్య దాని చుట్టూ ప‌ర్య‌వ‌సానాల నేప‌థ్యంలో ఆస‌క్తిక‌ర క్రైమ్ థ్రిల్ల‌ర్ ఇద‌ని అర్థ‌మ‌వుతోంది. నా భ‌ర్త‌ను నేనే చంపేశాను! అంటూ ఇషా రెబ్బా చెబుతున్న డైలాగ్ ని బ‌ట్టి మిస్ట‌రీ బ్యాక్ డ్రాప్ ఆస‌క్తి పెంచుతోంది. ఇక క్రైమ్ ఎప్పుడూ మూడు విష‌యాల చుట్టూ తిరుగుతుంది. ఒక‌టి డ‌బ్బు.. రెండు అమ్మాయి.. మూడు అనుమానం.. అవ‌మానం.. వీటిలో ఏదో ఒక కార‌ణం వ‌ల్ల హ‌త్య జ‌రిగింది! అందుకే అక్క‌డ‌ డ‌బ్బు చేతులు మారుతోంది! అన్న హింట్ కూడా ఇచ్చారు ట్రైల‌ర్ లో. ట్రైల‌ర్ లో బికినీ గాళ్స్ ట్విస్టు ర‌క్తి క‌ట్టిస్తోంది. అడివి శేష్ న‌టించిన ఎవ‌రు ఇటీవ‌లే రిలీజై చ‌క్క‌ని రివ్యూల‌తో పాజిటివ్ టాక్ న‌డుమ‌ ఘ‌న‌విజ‌యం అందుకున్న సంగ‌తి తెలిసిందేమ‌ర్డ‌ర్ మిస్ట‌రీ జోన‌ర్ లో ర‌క్తి క‌ట్టించింది. రాగ‌ల 24 గంట‌ల్లో ట్రైల‌ర్ చూశాక‌.. ఎవ‌రుతో పోలిక చూడొచ్చు. అయితే అక్క‌డ పాత్ర‌లు వేరు.. స‌స్పెన్స్ ఎలిమెంట్స్ వేరు అని అర్థ‌మ‌వుతోంది.

తెలుగ‌మ్మాయి ఇషా రెబ్బా న‌ట‌న‌కు ఆస్కారం ఉన్న పాత్ర‌లో మైమ‌రిపిస్తోంది. ఇన్నాళ్లు కామెడీ సినిమాలతో మెప్పించిన‌ దర్శకుడు శ్రీనివాస్ రెడ్డి మొదటిసారి థ్రిల్లర్ సినిమా చేస్తున్నారు. తమిళ హీరో శ్రీరామ్ కీల‌క పాత్ర‌లో నటిస్తున్నారు. చాలాకాలం తర్వాత కృష్ణభగవాన్ ఈ సినిమాలో కనిపించడం విశేషం. అక్టోబర్‌లో సినిమా రిలీజ్ కానుంది. స‌త్య‌దేవ్- ఈషా రెబ్బా- గణేష్ వెంకట్రామన్- ముస్కాన్ సేథీ (పైసావసూల్ ఫేమ్) ప్రధానపాత్రలు పోషించారు. శ్రీ కార్తికేయ సెల్యూలాయిడ్స్ సమర్పణలో, శ్రీ నవ్‌హాస్ క్రియేషన్స్ బ్యానర్‌పై శ్రీనివాస్ కానూరి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ర‌ఘు కుంచె సంగీతం .. భాస్కరభట్ల పాట‌లు అందించారు.