Begin typing your search above and press return to search.
పర్సనల్ కథనే చెప్పావా సునీత??
By: Tupaki Desk | 9 Oct 2016 4:23 AM GMTఇప్పుడు సింగర్ సునీత తొలిసారిగా నటించిన షార్ట్ ఫిలిం బయటకు వచ్చింది. శ్రీచైతు అనే అమ్మాయి డైరక్షన్లో రూపొందిన ఈ షార్టు ఫిలింలో నిజానికి చాలామంది ఇండిపెండెంట్ మహిళలకు సంబంధించిన కథే చెప్పినా కూడా.. ఎందుకు అక్కడ సునీత పర్సనల్ స్టోరీయే కనిపించడంతో చూసినవారందరూ షాకే తింటున్నారు. అసలు ఎంత పెయిన్ అనుభవించకపోతే సునీత ఈ కథను చేస్తుంది అని చెబుతున్నారు.
''రాగం'' అనే షార్టు ఫిలింలో సునీత తొలిసారిగా ముఖానికి మేకప్ వేసుకుని యాక్టింగ్ టాలెంట్ చూపించింది. ఇన్నాళ్లూ ఎంతమంది దర్శకులు నటించమని అడిగినా కూడా నో చెప్పేసిన సునీత.. ఇప్పుడు మాత్రం ఎందుకు ఒప్పుకుంది? అందుకే ఆ కథే కారణం అని చెప్పాలేమో. ఒంటరిగా జీవిస్తూ ఒక మహిళ తన కాళ్ళ మీద తాను నుంచుంటే.. ఆమె లేటుగా ఇంటికి వస్తే 'ఎక్కడికి వెళ్లొస్తుందో' అంటూ సాగదీసే పొరుగువారు.. అదే ఆమెకు ఆఫీసులకు ఒక అవకాశం వస్తే.. 'బాసుతో క్లోజ్ గా ఉందిలే' అంటూ కామెంట్లు చేసే సహోద్యోగులు.. ఇలాంటివారితో చాలా ఇబ్బందులే పడుతుంటారు. పోనివ్ లే అని వదిలేయలేం.. అలాగని పట్టించుకుంటే మనకు ఇంకా నరకంగా ఉంటుంది. సరిగ్గా అలాంటి ఓ ఒంటరి మహిళ కథే ఈ షార్ట్ ఫిలిం.
అయితే దగ్గరగా చూస్తే.. నిజానికి ఆరేళ్ల నుండి తన భర్త నుండి విడిపోయి ఒంటరిగా తన తల్లిదండ్రులు అండ్ పిల్లలతో కలసి జీవిస్తున్న రియల్ లైఫ్ కూడా కాస్త ఇలాంటి వాస్తవానికి దగ్గరగానే ఉందనేది చెప్పడానికే సునీత ఈ ఫిలిం చేసిందా అనే సందేహం.. ఈ మధ్య కాలంలో ఆమె ఇంటర్యూలను చదువుతున్నవారందరికీ వస్తోంది. ఆ క్లారిటీ సునీతే ఇవ్వాలి.