Begin typing your search above and press return to search.

నేనంత ముదురు కాదంటున్న రాయ్ లక్ష్మీ

By:  Tupaki Desk   |   4 April 2017 9:31 AM GMT
నేనంత ముదురు కాదంటున్న రాయ్ లక్ష్మీ
X
సినిమాలతో కంటే కూడా ఫొటో షూట్లతో.. ఎప్పుడూ ఏదో ఒక స్టేట్మెంట్ తో వార్తల్లో నిలుస్తూ ఉంటుంది రాయ్ లక్ష్మీ. మామూలుగా ఎవరైనా ఏదైనా విషయమై తమ మీద గట్టి ప్రచారం జరుగుతున్నపుడు వివరణ ఇస్తారు. కానీ రాయ్ లక్ష్మీ మాత్రం అందుకు భిన్నం. ఇంతకుముందు ఆమెకు ధోనితో ఎఫైర్ ఉందని.. ఒకటీ అరా గాలి వార్తలు వస్తే.. దాని మీద పనిగట్టుకుని అరగంట ఇంటర్వ్యూ ఇచ్చిందామె. ఆ ఇంటర్వ్యూ చూస్తే ధోనితో తనకు ఎఫైర్ అని వార్తలు రావడం మీద ఆమె నిజానికి చాలా హ్యాపీగా ఉన్నట్లుగా అనిపిస్తుంది. ఇక తన వయసుకు సంబంధించిన విషయంలోనూ అప్పుడప్పుడూ స్టేట్మెంట్ ఇవ్వడం రాయ్ లక్ష్మీకి అలవాటు.

అందరూ తనకు 30 ఏళ్లకు పైనే వయసుటుందని అంటుంటారని.. కానీ నిజానికి తనకు 26 ఏళ్లే అని గతంలోనే ఒక స్టేట్మెంట్ ఇచ్చింది రాయ్ లక్ష్మీ. ఇప్పుడు కూడా అదే పాట పాడుతోంది. తాను 15 ఏళ్లకే హీరోయిన్ గా అరంగేట్రం చేశానని.. ఇప్పుడు తన వయసు 26 ఏళ్లే అని.. అందరూ అనుకుంటున్నట్లుగా తానేమీ అంత ముదురు కాదని చెబుతోంది రత్తాలు. కొందరు చూడ్డానికి వయసు ఎక్కువలా కనిపిస్తారని.. తాను కూడా అదే బాపతు అని.. కాబట్టి తన వయసు గురించి తప్పుగా అంచనా వేయొద్దని ఆమె కోరింది. అయినా రాయ్ లక్ష్మీ వయసు గురించి ఇప్పుడు ఎవరు పట్టించుకుంటున్నారు.. దీనిపై రాద్దాంతం ఎక్కడ చేస్తున్నారు. పనిగట్టుకుని ఈ విషయమై ఆమె మళ్లీ మళ్లీ స్టేట్మెంట్లు ఇవ్వాల్సిన అవసరమేంటి?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/