Begin typing your search above and press return to search.

ఆమె ధైర్యం చెప్పి..హ‌గ్ చేసుకోమ‌న్న‌ద‌ట‌!

By:  Tupaki Desk   |   3 July 2018 5:57 AM GMT
ఆమె ధైర్యం చెప్పి..హ‌గ్ చేసుకోమ‌న్న‌ద‌ట‌!
X
ఆన్ స్క్రీన్ ముందు బ్ర‌హ్మాండంగా పండిన ఒక సీన్ వెనుక ఆఫ్ స్క్రీన్ లో ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఉండ‌కుండా ఉండ‌దు. అలాంటి విష‌యాన్ని ఒక‌టి చెప్పుకొచ్చాడు వ‌ర్థ‌మాన న‌టుడు అర్జున్‌. త‌మిళ్ చిత్రాల్లో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న ఈ కుర్రాడు.. ఎక్స్ వీడియోస్ చిత్రంలో నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్ట‌ర్ తో మంచి గుర్తింపు పొందాడు. క‌న్న‌డంలో సూప‌ర్ డూప‌ర్ హిట్ అయిన బెంగ‌ళూరు డేస్ చిత్రాన్ని త‌మిళంలో తీసిన ప్రాజెక్టులో అర్జున్ ఒక క్యారెక్ట‌ర్ చేశారు.

ఈ పాత్ర‌లో భాగంగా రాయ్ ల‌క్ష్మీతో రొమాన్స్ చేయాల్సిన స‌న్నివేశం ఉంది. స్వ‌త‌హాగా బిడియ‌స్తుడైన అర్జున్ ఇబ్బందిని గుర్తించిన రాయ్ లక్ష్మీ ఆయ‌న‌కు ధైర్యం చెప్పింద‌ట‌. భ‌య‌ప‌డ‌కు.. గ‌ట్టిగా కౌగిలించుకో అంటూ ధైర్యం చెప్ప‌టంతోనే తాను ఆ సీన్ ను బాగా చేసిన‌ట్లుగా చెప్పాడు. మ‌రింత ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమిటంటే.. అర్జున్ సినిమా ఎంట్రీగా చెప్పాలి.

చెన్నై అపోలో ఆసుప‌త్రిలో రిసెప్ష‌న్ లో అర్జున్ ఉద్యోగం చేసేవాడు. ఆ స‌మ‌యంలోనే ఆసుప‌త్రిలో హీరో సూర్య సినిమా షూటింగ్ జ‌రిగింది. ఈ సంద‌ర్భంలోనే ఆ చిత్రంలో న‌టిస్తున్న ర‌మ్య అనే న‌టి కార‌ణంగా త‌న‌కు బెంగ‌ళూరు డేస్ మూవీలో న‌టించే ఛాన్స్ దొరికిన‌ట్లుగా చెప్పారు. అలా మొద‌లైన అత‌గాడి సినిమా జ‌ర్నీ.. బెంగ‌ళూరు డేస్ చిత్ర అసోసియేట్ స‌జో సుంద‌ర్ తో స్నేహం కార‌ణంగా తాజా ఎక్స్ స్టూడియోస్ మూవీలో మంచి పాత్ర దొరికిన‌ట్లుగా చెప్పాడు. అర్జున్ తీరుచూస్తే..కాస్త అవ‌కాశం ఇచ్చినా అల్లుకుపోయేట‌ట్లు కనిపించ‌ట్లేదు?