Begin typing your search above and press return to search.
చైతూకు రొమాన్స్ బాగా అచ్చొచ్చింది
By: Tupaki Desk | 1 Jun 2017 4:47 AM GMTఅక్కినేని నాగచైతన్య లేటెస్ట్ మూవీ 'రా రండోయ్ వేడుక చూద్దాం' బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లనే రాబడుతోంది. స్ట్రాంగ్ వీకెండ్ తో పాటు.. వీక్ డేస్ లో కూడా కలెక్షన్స్ బాగుండడం విశేషం. రెండో వీకెండ్ లో కూడా ఈ వారం భారీగా ఫేర్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇప్పటివరకూ తొలి ఐదు రోజులకు గాను ఏపీ..తెలంగాణ రాష్ట్రాల నుంచి ఈ చిత్రానికి 12.09 కోట్ల షేర్ రాగా.. ఇందులో నైజాం వాటానే 4.2 కోట్లు ఉండడం విశేషం. ప్రస్తుతం ఈ సినిమా చూపిస్తున్న స్పీడ్ కి శనివారం నాటికే బ్రేక్ ఈవెన్ కు వచ్చేస్తుందని ట్రేడ్ జనాలు అంటున్నారు. అంటే ఆదివారం నుంచి డిస్ట్రిబ్యూటర్లకు లాభాలు వస్తాయన్న మాట. రొమాంటిక్ జోనర్ లో తన స్ట్రెంగ్త్ ఏంటో మరోసారి చూపించాడు చైతు. ప్రేమమ్ తో కూడా మంచి హిట్ కొట్టిన చైతు.. ఆ తర్వాత రిలీజ్ చేసిన సాహసం శ్వాసగా సాగిపో చిత్రానికి డీ మానిటైజేషన్ దెబ్బ ఎదుర్కోవాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు రా రండోయ్ అంటూ మళ్లీ రొమాంటిక్ సినిమాతోనే ప్రేక్షకులను మెస్మరైజ్ చేయగలిగాడు.
అయితే.. చైతు ఆశించిన స్థాయి బ్లాక్ బస్టర్ రేంజ్ కి రా రండోయ్ వేడుక చూద్దాం చేరుకోవడం కష్టం కావచ్చు. తొలి ఐదు రోజులకే 15 కోట్ల రూపాయల షేర్ ను వసూలు చేయగలిగినా... ఓవర్సీస్ లో ఈ సినిమా అంతగా వసూళ్లను రాబట్టలేకపోతోంది. చైతు కెరీర్ లో బిగ్గెస్ట్ మూవీగా రారండోయ్ అవతరించడం మాత్రం ఖాయంగా కనిపిస్తోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/