Begin typing your search above and press return to search.

బాలీవుడ్ ని త‌గ్గించి టాలీవుడ్ ని ఎత్తేసింది

By:  Tupaki Desk   |   23 Jan 2022 4:19 AM GMT
బాలీవుడ్ ని త‌గ్గించి టాలీవుడ్ ని ఎత్తేసింది
X
ఇరుగు పొరుగు ప‌రిశ్ర‌మ‌ల నుంచి టాలీవుడ్ లో న‌టించి ఇక్క‌డే స్థిర‌ప‌డేందుకు ఎక్కువ‌మంది పొరుగు క‌థానాయిక‌లు.. టాప్ మోడ‌ల్స్ ఆస‌క్తిని చూపిస్తుంటారు. తెలుగు చ‌ల‌న‌చిత్ర ప‌రిశ్ర‌మ‌లో ఒక స్థానం సంపాదించాక ఇరుగు పొరుగుపై దృష్టి సారించ‌డం సులువు అవుతుంద‌నేది వారి క్యాలిక్యులేష‌న్. అలా ఇప్ప‌టికే ముంబై నుంచి వ‌చ్చిన ఎంద‌రో క‌థానాయిక‌లు హైద‌రాబాద్ బేస్ మెంట్ తో అగ్ర హీరోయిన్లుగా ఎదిగారు.

ఆ త‌ర్వాత హిందీ చిత్ర‌సీమ‌తో పాటు త‌మిళం ఇత‌ర భాష‌ల్లోనూ అవ‌కాశాలు ద‌క్కించుకున్నారు. ఇది వాళ్ల‌కు కేక్ వాక్ లాంటి రాజ‌మార్గం అని ప్రూవ్ అయ్యింది.

ఇక‌పోతే దిల్లీ భామ రాశీ ఖ‌న్నా అందుకు మిన‌హాయింపేమీ కాదు. తొలుత బాలీవుడ్ లో ఓ క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుగా ప్రారంభ‌మై ఆ త‌ర్వాత నేరుగా అవ‌స‌రాల శ్రీ‌నివాస్ అవ‌కాశం ఇవ్వ‌డంతో ఇక్క‌డ మెయిన్ స్ట్రీమ్ హీరోయిన్ అయిపోయింది. అటుపై ద‌శాబ్ధ కాలంగా త‌న స‌త్తా చాటుతూనే ఉంది. గ్లామ‌ర‌స్ నాయిక‌గా న‌టిగా త‌న‌ను తాను ఇంప్రూవ్ చేసుకుంటూనే ఉన్న రాశీ తాజా ఇంట‌ర్వ్యూలో హిందీ ప‌రిశ్ర‌మ‌ను త‌గ్గించి తెలుగు చిత్ర‌సీమ‌ను ఆకాశానికెత్తేసింది.

అయితే దీనికి కార‌ణం లేక‌పోలేదు. త‌న‌ని ఆద‌రించింది తెలుగు చ‌ల‌న‌చిత్ర ప‌రిశ్ర‌మ‌. దానికి తోడు ఇటీవ‌లి కాలంలో టాలీవుడ్ ఇమేజ్ బాలీవుడ్ ని మించిపోతోంది.

ఇక్క‌డి క‌మ‌ర్షియ‌ల్ సినిమాలు హిందీ ఆడియెన్ కి మైండ్ బ్లాక్ చేస్తున్నాయి.

భారతదేశంలోని వివిధ చిత్ర పరిశ్రమలపై నటి రాశీ ఖన్నా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.

``బాలీవుడ్ దక్షిణాది నుండి చాలా తీసుకుంటోంది. మలయాళ సినిమా పూర్తిగా కంటెంట్ రిచ్ నెస్ తో ఉంటుంది... తెలుగు సినిమా ఎక్కువగా కమర్షియల్ గా ఉంటుంది. హిందీ సినిమా ఇప్పటికీ దాని స్థానాన్ని కనుగొనడానికి ప్రయత్నిస్తోంది`` అని తెలిపింది. నిజానికి హిందీ చిత్ర‌సీమ ఇటీవ‌లి కాలంలో పూర్తి ఒడిదుడుకుల్లో ఉన్న వాస్త‌వాన్ని రాశీ ఖ‌న్నా వెలుగులోకి తెచ్చింది.

టాలీవుడ్ సినిమాలు హిందీలోనూ బంప‌ర్ హిట్లు కొడుతుంటే అక్క‌డ ఖాన్ లు న‌టించిన సినిమాలు ఫ్లాప్ లుగా నిలుస్తున్నాయి. క‌మ‌ర్షియ‌ల్ సినిమా తీయాలా.. కంటెంట్ డ్రివెన్ సినిమా తీయాలా? అన్న సందిగ్ధ‌త ఇటీవ‌ల బాలీవుడ్ లో అంత‌కంత‌కు పెరిగిపోతోంద‌నేది నిజం.

సమతూకం పాటించేందుకు నేటి హిందీ సినిమా కష్టపడుతున్న మాట వాస్వం. ఇక మ‌ల‌యాళంలో ప్ర‌తియేటా అవార్డులు కొల్ల‌గొట్టే రేంజు కంటెంట్ తో సినిమాలు వ‌స్తున్నాయి.
ఇటీవ‌ల బాహుబ‌లి - కేజీఎఫ్ - పుష్ప లాంటి చిత్రాలు సౌత్ నుంచి వెళ్లి హిందీలో సంచ‌ల‌న వ‌సూళ్ల‌ను సాధించాయి. ఇదంతా మారుతున్న ఫేజ్ గా ప‌రిగ‌ణించాల్సి ఉంటుంది.