Begin typing your search above and press return to search.
ఇళయదళపతి సరసన జాక్ పాట్!
By: Tupaki Desk | 5 July 2019 4:40 AM GMTరకుల్ ప్రీత్ సింగ్ జయాపజయాలతో పని లేకుండా టాలీవుడ్ లో కెరీర్ ని సాగిస్తోంది. అయితే కొంత కాలంగా ఆమె స్పీడుకు బ్రేకులు పడ్డాయి. వరుసగా క్రేజీ ఆఫర్లతో దూసుకుపోతున్న రకుల్ కు యంగ్ హీరోయిన్స్ షాకిస్తున్నారు. తమిళ క్రేజీ హీరో ఇళయదళపతి విజయ్ ప్రస్తుతం అట్లీ కుమార్ దర్శకత్వంలో `బిగిల్` చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో తండ్రిగా, కొడుకుగా విజయ్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. తేరి, మెర్సల్ చిత్రాల తరువాత వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న మూడవ చిత్రమిది. అంతే కాకుండా వరుసగా విజయ్ ద్విపాత్రిభినయం(మెర్సల్ లో త్రిపాత్రాభినయం) చేస్తున్న మూడవ సినిమా కూడా ఇదే.
ఈ సినిమా అండర్ ప్రొడక్షన్ లో వుండగానే విజయ్ తన 64వ చిత్రాన్ని కూడా లైన్ లో పెట్టేశారు. ఈ సినిమాకు లోకేష్ కనగకాజ్ దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమాకు సంబంధించి రోజుకో వార్త హల్ చల్ చేస్తూ ఈ ప్రాజెక్ట్ పై ప్రేక్షకుల్లో, విజయ్ అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. తొలిసారి లోకేష్ కనగరాజ్ తో కలిసి విజయ్ చేయబోతున్న సినిమా ఎలా వుండబోతోంది?. ఆయనకు జోడీగా ఎవరు నటించబోతున్నారు? అన్న క్యూరియాసిటీ అభిమానుల్ని నిలవనీయడం లేదు. ఇందులో విజయ్ తో త్రిష, రకుల్ రొమాన్స్ చేస్తారని ప్రచారం జరుగుతోంది. అయితే ఆ ప్రచారం వాస్తవం కాదని తేలింది. తాజాగా దళపతి సరసన ఓ ఇద్దరు యంగ్ హీరోయిన్ల పేర్లు వినిపిస్తున్నాయి.
తెలుగులో క్రేజీ కథానాయికగా పేరు తెచ్చుకుని వరుస క్రేజీ ఆఫర్లని సొంతం చేసుకుంటున్న రష్మిక మందన్నను విజయ్‌కి జోడీగా చిత్ర బృందం ఎంపిక చేశారని.. ఆమెతో పాటు రాశిఖన్నా కూడా మరో నాయికగా నటించనుందని తాజాగా వినిపిస్తోంది. అంతకు ముందు కీర్తిసురేష్ పేరు ప్రముఖంగా వినిపించింది. ఆ తరువాత సమంత నటించే అవకాశం వుందన్నారు. కానీ చివరికి ఆ అవకాశం రష్మిక, రాశిఖన్నాలకు దక్కిందని తెలుస్తోంది. దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ త్వరలోనే రానుందని చెబుతున్నారు. కాగా విజయ్ మార్కు యాక్షన్ ఎంటర్టైనర్గా రాబోతున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ నుంచి ప్రారంభం కాబోతోంది.