Begin typing your search above and press return to search.

కాప్ రోల్ లో బ‌బ్లీ బ్యూటీ హ్యాట్రిక్

By:  Tupaki Desk   |   21 July 2020 12:30 AM GMT
కాప్ రోల్ లో బ‌బ్లీ బ్యూటీ హ్యాట్రిక్
X
కోటి పారితోషికం చెల్లించి కాప్ రోల్ ఆఫ‌ర్ చేస్తే వ‌ద్దు అని ఏ క‌థానాయిక అయినా చెబుతుందా? అదిగో అలాంటి ఆఫ‌రే బ‌బ్లీ బ్యూటీ రాశీ ఖ‌న్నాను వ‌రించింద‌ట‌. పోలీస్ పాత్ర‌లో ఆఫ‌ర్ మూడోసారి త‌న‌కు. నిజంగానే జాక్ పాట్ ప‌ట్టేసింది క‌దూ? ఇంత‌కీ ఎవ‌రీ భామ‌.. ఏ మూవీలో ఆఫ‌ర్? అంటే.... వివ‌రాల్లోకి వెళ్లాల్సిందే.

బబ్లీ బ్యూటీ రాశీఖ‌న్నా మ‌ళ్లీ పోలీస్ పాత్ర‌లో క‌నిపించ‌బోతోంది. శింబు అప్ క‌మింగ్ మూవీలో రాశీఖన్నా ఓ అండ‌ర్ కాప్ గా న‌టిస్తోంది. నిజానికి కాప్ రోల్ త‌న‌కు కొత్తేమీ కాదు. ఇప్ప‌టికే రాశీ కామెడీ పోలీస్ గా సుప్రీమ్ సినిమాలో న‌టించింది. ఆ మూవీలో బెల్లం శ్రీదేవి పాత్ర‌తో మాస్ ఆడియెన్స్ ని ఎంట‌ర్ టైన్ చేసింది. ఇప్పుడు గ్లామ‌రస్ పోలీస్ గా అటు త‌మిళ జ‌నాల్ని ఇటు తెలుగు ఆడియెన్స్ ని ఎంట‌ర్ టైన్ చేయ‌డానికి గ్రీన్ సిగ్నెల్ ఇచ్చింది.

ఈసారి గ్లామ‌ర‌స్ కాప్ గా ఏ మూవీలో న‌టించ‌బోతోంది? అంటే .. యాక్ష‌న్ కింగ్ అర్జున్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న తాజా చిత్రంలో రాశీకి ఈ త‌ర‌హా ఆఫ‌ర్ ద‌క్కింద‌ట‌. ఇందులో కాప్ పాత్ర‌లో మైమ‌రిపించ‌బోతోంద‌ట‌. ఈ క్యారెక్ట‌ర్ చేయ‌డానికి రాశీకి దాదాపు కోటి రూపాయ‌లు దాకా పారితోషికం అంద‌బోతుంద‌ని స‌మాచారం.