Begin typing your search above and press return to search.
రాశి ఖన్నా.. ఇంతకంటే హై డోస్ ఉంటుందా?
By: Tupaki Desk | 16 Jan 2023 4:30 PM GMTటాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని సొంతం చేసుకున్న అందాల భామ రాశి ఖన్నా. ఈ అమ్మడు మద్రాస్ కేఫ్ సినిమాతో బాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. తరువాత ఊహలు గుసగుసలాడే సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే హిట్ కొట్టింది. తరువాత వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం లేకుండా వరుసగా కుర్ర హీరోలకి జోడీగా నటిస్తూ స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. సాయి ధరమ్ తేజ్, గోపీచంద్, రవితేజ లాంటి స్టార్స్ తో ఈ అమ్మడు ఆదిపాడింది. తెలుగులో చివరిగా ఈ భామపక్కా కమర్షియల్ సినిమాలో నటించింది.
ఈ మూవీలో ఆమె మంచి ఫన్ జెనరేట్ చేసే పాత్రలో కనిపించి మెప్పించింది. హీరోయిన్ అంటే రొమాన్స్ మాత్రమే కాదు ఫన్ కూడా క్రియేట్ చేస్తారని ఈ బ్యూటీ సుప్రీమ్, ప్రతి రోజు పండగే, పక్కా కమర్షియల్ లాంటి సినిమాలతో ప్రూవ్ చేసుకుంది. ప్రస్తుతం ఈ బ్యూటీకి తెలుగులో అనుకున్న స్థాయిలో అవకాశాలు రావడం లేదు. రోజు రోజుకి కుర్ర హీరోయిన్స్ కాంపిటేషన్ లోకి రావడంతో రాశి ఖన్నా ఫేట్ మారుతుంది. చివరిగా ఆమె తమిళంలో సర్దార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చింది. అయితే ఈ మూవీలో ఆమెకి చెప్పుకోదగ్గ పాత్ర అయితే పడలేదు.
ఇదిలా ఉంటే ఈ మధ్య సినిమా అవకాశాలు తగ్గినా హీరోయిన్స్ అందరూ ఒటీటీ బాట పడుతున్నారు. అక్కడ అవకాశాలు పుష్కలంగా ఉండటంతో మంచి ఛాన్స్ కోసం ఎదురుచూసి తమని తాము ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపధ్యంలో ఆమె మొదటి వెబ్ సిరీస్ రిలీజ్ రెడీ అవుతుంది. విజయ్ సేతుపతి, షాహిద్ కపూర్ కాంబినేషన్ లో రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో ఫాజీ అనే వెబ్ సిరీస్ తెరకెక్కించి. దీనిలో రాశి ఖన్నా కూడా కీలక పాత్రలో కనిపిస్తుంది. ఇక ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్ లో రాశి ఖన్నా స్పెషన్ ఎట్రాక్షన్ గా నిలిచింది అని చెప్పాలి. వయసు పెరిగిన ఏ మాత్రం వన్నె తగ్గని అందాలతో ఈ బ్యూటీ మెరిసిపోతూ కనిపించింది.
ఇందులో గ్రీన్ కలర్ డ్రెస్ లో ఎద అందాలు కనిపించే విధంగా ఆమె ఇచ్చిన పోజులకి ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. ఆమె తెలుగులో గ్లామర్ రోల్స్ చేసింది తక్కువే అని చెప్పాలి. అయితే కరెక్ట్ గా వినియోగించుకుంటే రాశి ఖన్నా సొగసులు కచ్చితంగా మంచి ఎస్సెట్ అవుతాయని భావిస్తున్నారు. ఇప్పటికే హిందీలో రుద్ర వెబ్ సిరీస్ తో బాలీవుడ్ లో రాశి ఖన్నా రీఎంట్రీ ఇచ్చింది. ఆ వెబ్ సిరీస్ ఆకట్టుకుంది. ఇప్పుడు ఫాజీతో మరోసారి మెస్మరైజ్ చేయడానికి రెడీ అవుతుంది. మరోవైపు కరణ్ జోహార్ ధర్మ ప్రొడక్షన్ లో యోధ అనే సినిమాతో తన అదృష్టం పరీక్షించుకునే ప్రయత్నం చేస్తుంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.