Begin typing your search above and press return to search.

16 ఏళ్లకే ఫస్ట్ డేట్‌ - సీక్రెట్ బయటపెట్టిన స్టార్ హీరోయిన్..!

By:  Tupaki Desk   |   22 April 2020 4:30 PM GMT
16 ఏళ్లకే ఫస్ట్ డేట్‌ - సీక్రెట్ బయటపెట్టిన స్టార్ హీరోయిన్..!
X
సెలబ్రిటీలు సాధారణంగా వారి వ్యక్తిగత జీవితాన్ని ప్రైవేట్‌ గా ఉంచుకుంటుంటారు. కానీ మీడియా మరియు ఫ్యాన్స్ వల్ల వారి పర్సనల్ లైఫ్ ఎంత సీక్రెట్ గా ఉంచుదాం అనుకున్నా అది కుదరదు. ఒకవేళ వాళ్ళు తమ లైఫ్ గురించి నిజాలను బయటకి చెప్పకపోతే పుకార్లు పుట్టించి షికారు చేసేలా చేసేస్తారు. ముఖ్యంగా హీరోయిన్స్ ఈ విషయాలలో జాగ్రత్తగా ఉంటూ ఉంటారు. అయితే రీసెంటుగా మన బొద్దుగుమ్మ రాశీ ఖన్నా తన లైఫ్ లోని ఒక సీక్రెట్ బయటపెట్టింది. చిన్న సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి టాలీవుడ్‌ లో స్టార్‌ హీరోయిన్‌ గా ఎదిగిన అందాల భామ రాశీ ఖన్నా. కెరీర్ స్టార్టింగ్‌ లో బొద్దుగుమ్మగా ఉన్న ఈ భామ తరువాత స్లిమ్ లుక్‌ లోకి మారిపోయింది. ప్రస్తుతం కరోనా లాక్ డౌన్‌ కారణంగా హీరో హీరోయిన్లు అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. అయితే టెక్నాలజీ పెరుగుతున్న నేపథ్యంలో డిజిటల్‌ - వెబ్‌ మీడియాల ద్వారా అభిమానులతో ముచ్చటిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే రాశీ ఖ‌న్నా లాక్ డౌన్ నేప‌థ్యంలో ఇంటికే ప‌రిమిత‌మై ఓ వెబ్ ఛానెల్‌ కు ఇంట‌ర్వ్యూ ఇచ్చింది. ఈ ఇంట‌ర్వ్యూలో ఈ సందర్భంగా తన పర్సనల్‌ లైఫ్ కు సంబంధించి ఆ సక్తికర విషయాలను వెల్లడించింది. అంతేకాకుండా ఆమె తన తొలి డేటింగ్ విశేషాల్ని బయటపెట్టింది రాశిఖన్నా. త‌న తొలి ప్రేమ అనుభూతుల‌ను పంచుకున్న ఆమె అది డేటింగ్ అన్న విష‌యం కూడా త‌న‌కు తెలియ‌ద‌ని చెప్పింది.

తనకు 16 ఏళ్ళ వయసున్నపుడు తొలిసారిగా డేట్‌ కు వెళ్లిందట రాశీఖన్నా. 'నా ఫ్రెండ్ నన్ను డేట్‌ కు పిలిచాడు. అప్పట్లో అది డేట్ అని కూడా నాకు తెలియదని చెప్పింది. తన పుట్టిన రోజు సందర్భంగా పార్టీ ఇస్తానని చెప్పి ఆ కుర్రాడు రాశీని బయటకు తీసుకెళ్లాడట. ఇంటి దగ్గరల్లోనే ఉన్న మెక్‌ డోనాల్డ్స్‌ కు రమ్మనటంతో దగ్గరే అన్న ఉద్దేశంతో వెళ్లానని చెప్పిందట. అయితే ఆ సమయంలో తను బాగా ఆకలితో ఉండటంతో ఫుడ్ ఆర్డర్ ఇచ్చేసి అన్నీ తినేసిందట. కానీ తాను తింటున్నంత సేపు ఆ కుర్రాడు రాశీని పొగుడుతూనే ఉన్నాడట. బిల్లు కూడా అతనే కట్టాడట. అలా తప ఫస్ట్ డేట్‌ 16 ఏళ్ల వయసులోనే ముగిసిందని అందాల భామ రాశీ ఖన్నా అభిమానులతో పంచుకుంది. అయితే అదే తన జీవితంలో ఫస్ట్ అండ్ లాస్ట్ డేట్ అని కూడా చెప్పింది రాశీ. ఇండస్ట్రీకి వచ్చిన తరువాత కూడా ఎవరితో డేట్‌ కు వెళ్లలేదని చెపుతోంది రాశీ ఖన్నా. ప్రస్తుతం తాను మీదే దృష్టి పెట్టానని చెబుతున్న రాశీ - ఇప్పట్లో డేటింగ్ - లవ్ లాంటి విషయాలు సమయం కేటాయించేంత తీరిక లేదని చెప్పుకొచ్చింది.

లాక్ డౌన్ సమయంలో తన చిన్ననాటి నుండి గిటార్ నేర్చుకోవాలనే డ్రీమ్ ని ఇప్పుడు ఫుల్ ఫిల్ చేసుకోవడానికి ట్రై చేస్తోందట. ఇప్పటికే గిటార్ ప్లే చేయడంలో బేసిక్స్ తెలిసిన రాశీ ఇప్పుడు దానిలో పూర్తి ప్రావీణ్యం సాధించడం కోసం కృషి చేస్తోందట. ఇటీవల విజయ్‌ దేవరకొండ హీరోగా తెరకెక్కిన వరల్డ్‌ ఫేమస్ లవర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది రాశీ. అయితే ఈ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. అంతేకాదు ఈ సినిమాలో బోల్డ్ సీన్స్‌ లో నటించటంపై రాశీ విమర్శల పాలయ్యింది.