Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: ఆహా ఎంత స్పైసీ!!

By:  Tupaki Desk   |   23 April 2018 4:32 AM GMT
ఫోటో స్టోరి: ఆహా ఎంత స్పైసీ!!
X
టాలీవుడ్ లో హోమ్లీలుక్ తో కనిపించే హీరోయిన్లలో రాశీ ఖన్నా పేరు ముందుంటుంది. ఆమె మొదటి సినిమా ఊహలు గుసగుసలాడే నుంచి తాజాగా రిలీజైన తొలిప్రేమ వరకు రాశీ హోమ్లీ లుక్ లోనే అదరగొట్టేసింది. మధ్యలో ఒకటి రెండు సినిమాల్లో అందాలు ఆరబోసినా అవేవీ జనాలకు పెద్దగా నోటవలేదు.

టాప్ హీరోయిన్ గా కొనసాగాలంటే ఈ హోమ్లీ లుక్ తో పెద్దగా లాభం లేదనుకుందో ఏమో కానీ రాశీ ఖన్నా రూటు మార్చేసింది. హాట్ హాట్ ఫోజులతో.. కైపెక్కించే డ్రస్సులతో కుర్రాళ్ల గుండెలను కొల్గగొట్టే పనుల్లో పడిపోయింది. తాజాగా రెడ్ కలర్ అల్రా మోడ్రన్ డ్రస్ అండ్ స్పైసీ లుక్ లో ఓ ఫొటో సోషల్ మీడియాలో షేర్ చేసింది. రాశీ ఈ రేంజిలో గ్లామర్ ఆరబోస్తుందా అని చూసివనవాళ్లంతా నోరెళ్లబెట్టేలా ఈ ఫోజు ఉండటం విశేషం. తాను గ్లామర్ రోల్స్ అదరగొట్టేయగలను అని ప్ర్రూవ్ చేసుకోవడమే లక్ష్యంగా రాశీ ఈ ఫొటో షూట్ చేసినట్టు కనిపిస్తోంది.

ఈ ఫొటోతోపాటు రాశీ ఓ కొటేషన్ కూడా యాడ్ చేసింది. అదేంటంటే ‘‘బాడీ షేప్ కు తగ్గట్టుగా డ్రస్ ఉండాలి. అంతేకానీ డ్రస్ కు తగినట్టు బాడీ షేప్ ఉండదు’’. రాశీ ఫొటోతో పాటు కొటేషన్ కూడా అదరగొట్టేసిందనే చెప్పాలి. ప్రస్తుతం రాశీ ఖన్నా నితిన్ పక్కన శ్రీనివాస కళ్యాణం లో హీరోయిన్ గా నటిస్తోంది.